Home తాజా వార్తలు హైదరాబాద్‌లో దళితులకు రక్షణ లేదు : మందకృష్ణ

హైదరాబాద్‌లో దళితులకు రక్షణ లేదు : మందకృష్ణ

MRPS Chief Manda Krishna Visitation to Rape Victim Girl Family

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. బిర్లామందిర్ సమీపంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులపై సిఎం కెసిఆర్ సవతితల్లి ప్రేమను చూపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎస్‌సి, ఎస్‌టి కేసులపై మానిటరింగ్ కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని కలెక్టర్, నగర పోలీసు కమిషనర్ పరామర్శించకపోవడంపై ఆయన మండిపడ్డారు. తక్షణమే బాధిత బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

MRPS Chief Manda Krishna Visitation to Rape Victim Girl Family