Home తాజా వార్తలు హరీష్‌ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు

హరీష్‌ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు

HARISH-RAOవరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు పొటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ ఎంపిగా ఉన్న కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ మంత్రి హరీష్‌రావు వరంగల్ పట్టణంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాశిబుగ్గ వద్ద హరీష్‌రావును ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని ఆయన్ను డిమాండ్ చేశారు. మాదిగలను నిర్లక్షం చేస్తున్న టిఆర్‌ఎస్‌కు గట్టి గుణపాఠం చెబుతామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.