పాన్గల్ : ఈనెల 27న వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సింహగర్జన మహాసభను జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు గంధం లక్ష్మయ్య, ఆదిస్వామి, సన్నయ్యలు కోరారు. మంగళవారం వారు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం దళిత, గిరిజనులకు రక్షణలా ఉన్న అట్రాసిటి చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం చట్టాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బిజెపి పాలనలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్ గోరక్షణ పేరుతో దళితులపై దాడులు ,అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్లో జరిగే సింహగర్జన సభ ఎంఆర్పిఎస్ మందకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతుందని , గ్రామాల నుండి వందలాదిగా ఎస్సీ, ఎస్టీలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈనెల 10 నుండి ప్రారంభించనున్న రైతు బంధు పథకం
ద్వారా ఇచ్చే రూ. 4వేల చెక్కులను మొదటి విడతగా ఎస్సీ ,ఎస్టీలకు పంపిణి చేయాలని కోరారు.
18ః సమావేశంలో మాట్లాడుతున్న ఎంఆర్పిఎస్ నాయకులు