Search
Thursday 15 November 2018
  • :
  • :

కంచె తెంచుకున్న అభిమానం.. మ్యాచ్ మధ్యలో పాదాభివందనం

Dhoni-Fan-Blessing

భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు వామప్ మ్యాచ్ జరిగింది. ఇది అందరికీ మామూలు విషయమే. కానీ ధోని అభిమానులకు మాత్రం కాస్త చేదు వార్త. ఎందుకంటే ధోని భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న ఆఖరి మ్యాచ్ ఇది. కొద్ది రోజుల క్రితం కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ధోని ప్రకటించిన విషయం తెలిసిందే.
సరే అసలు విషయానికొస్తే సోమవారం ముంబయిలో జరిగిన భారత్-ఎ, ఇంగ్లాండ్‌XI జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ అసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అంబాటి రాయుడు తన సెంచరీ పూర్తి చేసుకొని రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే ఆట మధ్యలో ధోని అభిమాని ఒకరు అకస్మాత్తుగా గ్రౌండ్‌లోకి ప్రవేశించాడు. దీంతో సిబ్బంది అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అందరిని దాటుకొని అతడు తన అభిమాన క్రికెటర్ వద్దకు చేరుకున్నాడు. ధోని కూడా అతన్ని ఆప్యాయంగా దగ్గరికి ఆహ్వానించాడు. అతడు ధోని వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు సమస్కారం చేశాడు. ఇంతలో సిబ్బంది వచ్చి ఆ అభిమానిని లాక్కెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Comments

comments