Home ఛాంపియన్స్ ట్రోఫీ వహ్వా ధోనీ…

వహ్వా ధోనీ…

Dhoniముంబయి: రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ స్టార్ ఆటగాడు మ హేంద్ర సింగ్ ధోనీపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంగళవారం ముంబయితో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ చిరస్మరణీ ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో కళ్లు చెదిరే సిక్సర్లతో ముంబయి బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో అతని ఇన్నింగ్స్‌పై అభిమానులు సోషల్ నెట్‌వర్క్ మాధ్యమం ట్విటర్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. కీల క సమయంలో ధోనీ అద్భుతంగా ఆడాడని ప్రశంసలు కురిపిం చాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో తానెంత కీలక ఆటగాడో ధోనీ నిరూపించాడని వారంటున్నారు. భారత మాజీ క్రికెటర్లు మహ్మ ద్ కైఫ్, సంజయ్ మంజ్రేకర్, ఆకాష్ చోప్రా, మురళీకార్తిక్ తది తరులు కూడా ట్విటర్‌లో ధోనీ ఇన్నింగ్స్‌ను కొనియాడారు. అం తేగాక, పుణె ఫ్రాంచైజీ యాజమానులు గోయంకా సోదరులు కూడా ధోనీని ప్రశంసలతో ముంచెత్తారు. జట్టును ఫైనల్‌కు చేర్చ డంలో ధోనీ పాత్ర మరువలేనిదని వీరి ట్విటర్‌లో పేర్కొన్నారు.