Search
Saturday 22 September 2018
  • :
  • :

అందులోనూ మహేంద్రుడే టాప్

MS Dhoni pays highest income tax

రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారీ మొత్తంలో ఆదాయపు పన్ను కట్టి తాజాగా వార్తల్లో నిలిచారు. జార్ఖండ్ లో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా ధోనీ నిలిచాడని ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు పేర్కొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ధోని ఏకంగా రూ.12.17 కోట్ల  పన్ను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇది గతేడాదితో పోల్చుకుంటే రూ.1.24 కోట్లు ఎక్కువని అధికారు వెల్లడించారు. భారీగా పన్ను చెల్లించడమే కాకుండా, రానున్న వార్షిక ఆదాయానికి సంబంధించి సుమారు రూ.3 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్‌ను ముందే డిపాజిట్ కూడా చేసినట్లు సమాచారం.

ఇక 2016-17లో ధోని రూ.10.93 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి జార్ఖండ్-బిహార్ ప్రాంతంలో ఎక్కువ పన్నును చెల్లించిన వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఫోర్బ్స్‌ ప్రకటించిన అధికంగా ఆర్జించే ఇండియన్ క్రికెటర్ల జాబితాలో ధోని మూడోస్థానంలో నిలిచారు. తొలి రెండు స్థానాల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మాజీ క్రికెటర్ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నారు. అలాగే గతేడాది ఫోర్బ్స్‌ సెలబ్రిటీల లిస్టులో ధోని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 2017లో ధోనీ రూ. 63.7 కోట్లు ఆర్జించాడు. ఇదే ఏడాది మహి సెవెన్ అనే పేరిట వస్త్ర వ్యాపారంలో కూడా అడుగు పెట్టాడు. ఇక ‘హకీ ఇండియా లీగ్’లో రాంచీ రేస్ జట్టుకు, ‘ఇండియా సూపర్ లీగ్’లో చెన్నయిన్ ఎఫ్ సికి ధోని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇలా పలు విధాలుగా మహేంద్రుడు ఆదాయం ఆర్జిస్తున్నాడు.

Comments

comments