Home తాజా వార్తలు ధోనీ అరుదైన రికార్డు

ధోనీ అరుదైన రికార్డు

MS Dhoni

300 టి20లు ఆడిన ఏకైక భారతీయ క్రికెటర్

హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి 20 మ్యాచ్‌లో బరిలోకి దిగడంద్వారా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక టి 20 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. తాజా మ్యాచ్ ధోనీకి 300వది. ఇప్పటివరకు 11 మంది ఈ ఘనత సాధించగా ఇప్పుడు ధోనీ వారి సరసన చేరాడు. భారత్ తరఫున మాత్రం ఈ రికార్డు సాధించింది ధోనీ ఒక్కడే.

భారత్ తరఫున 95 టి 20 మ్యాచ్‌లు ఆడిన ధోనీ ఐపిఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాచ్‌లే 185 ఉన్నాయి. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున 20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఈ జట్టు మనుగడలో లేదు. ఇప్పటివరకు టి 20లలో 24 అర్ధ సెంచరీలు చేసిన ధోనీ 38.57 సగటుతో 6,134పరుగులు చేశాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టి 20 మ్యాచ్‌లు ఆడిన వారిలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 446 మ్యాచ్‌లు ఆడాడు. కాగా ధోనీ తర్వాత 298 టి20లతో రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

MS Dhoni played 300 T20 Matches