Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

చెన్నై సిక్సర్ల రికార్డు

MS Dhoni Rolls Back the Years as Sixes Record
l అత్యధిక సిక్సర్లు బాదిన ధోని, రాయుడు
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిక్స్‌ల మోత మోగించాడు. తానొక్కడే ఏకంగా 7 సిక్స్‌లు బాదేశాడు. మరో ఆటగాడు అంబటి రాయుడు కూడా 8 సిక్స్ లు దంచేశాడు. ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం బౌండరీల సంఖ్య 51. ఇందులో 18 ఫోర్లు ఉం డగా 33 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఐపిఎల్ చరిత్ర లో అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, గత ఏడాది గుజరాత్ లయన్స్- ఢిల్లీ డేర్ డెవిల్స్ మ ధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 31 సిక్స్‌లు న మోదవ్వడమే ఇప్పటికీ అత్యధికం. ఈ రికార్డును చెన్నై-బెంగళూరు మ్యాచ్ తుడిచిపెట్టేసింది.

Comments

comments