Home తాజా వార్తలు మహేంద్రుడి మరో అవతారం..!

మహేంద్రుడి మరో అవతారం..!

MS Dhoni served as a 12th Player in T20 Match against Irland

డబ్లిన్: భారత్-ఐర్లాండ్ మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఓ ఆశ్చర్యకరమైన సన్నివేశం కనిపించింది. ఈ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏకంగా 12వ ఆటగాడి అవతారమెత్తాడు. మహేంద్రుడు సహచర ఆగటగాళ్ల కోసం డ్రింక్స్, కిట్ బ్యాగ్‌లను మోసుకెళ్తూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధోనీ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానంలో కెఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, ఉమేష్ యాదవ్, సిద్దార్థ్ కౌల్‌లను ఆడించారు. అయితే, ధోనీ హాయిగా ఎసి గదిలో విశ్రాంతి తీసుకోలేదు. సహచర ఆటగాళ్ల కోసం 12వ ఆటగాడిగా మారాడు. వారి కోసం మైదానంలోకి డ్రింక్స్, కిట్ బ్యాగ్‌లు తీసుకెళ్లడం గమనార్హం. ఇప్పడు దీనికి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన మహీ అభిమానులు…”కొత్త అవతారంలో ధోనీ, ప్రపంచం మెచ్చిన డ్రింక్స్‌ మ్యాన్‌, క్రికెట్‌లో నీ ప్రదర్శన చూసి అభిమానులయ్యాం.. కానీ, నీ మంచి ప్రవర్తన చూసి మేమంతా నీకు బానిసలైపోయాం, జట్టు కోసం ఏమైనా చేసేవాడు, మిలియన్‌ డాలర్‌ డ్రింక్స్‌ మ్యాన్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా మహేంద్రుడు ఏం చేసిన సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి.