Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నా తొలి టెస్టు వికెట్ నువ్వే!

MS-Dhoni

పీటర్సన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎంఎస్ ధోనీ…

పుణె: ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో రైజింగ్ సూపర్‌జెయింట్ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబయి బ్యాటింగ్ చేస్తుండగా, మ హేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు. ఈ మ్యా చ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ధోనీని ఉద్దేశించి ‘ధోనీ కంటే తానే గొప్ప ఆటగాడిని’ అని సంభోదించాడు. పీటర్సన్ వ్యాఖ్యలపై స్పందించిన ధోనీ ‘నువ్వు నా  తొలి టెస్టు వికెట్ కదా?’ అని నవ్వుతూ  తనదైన శైలిలో జవాబిచ్చాడు.

ఇంతకీ ఏమి జరిగిం దంటే.. పుణె, ముంబయి మ్యాచ్ సందర్భంగా మైక్రోఫోన్‌లో మాట్లాడుతున్న మనోజ్ తివారితో పీటర్సన్ ఇలా అన్నాడు. ‘ధోనీ కంటే తానే గొప్ప ఆటగాడిని’ అనే మాటలను మైదానంలో ఉన్న ధోనికి చేరవేయాలని అడిగాడు. వెంటనే తివారి ఫీల్డింగ్ చేస్తున్న ధోనీ వద్దకు వెళ్లి పీటర్సన్ చెప్పిన విషయాన్ని చెవిలో వేశాడు. దీనిపై స్పందించిన ధోనీ నవ్వుతూ.. ‘నువ్వు నా  తొలి టెస్టు వికెట్ కదా?’ అని కౌంటర్ ఇచ్చాడు. అది చూసిన పీటర్సన్ ముఖంలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. 2011 లో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ జరిగిన సమయంలో ధోనీకి అనుకోకుండా బౌలింగ్ వేయాల్సి వచ్చింది. ఈ టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ నమోదు చేసిన పీటర్సన్ వికెట్‌ను ధోనీ పడగొట్టాడు.

Comments

comments