Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

గేమింగ్ ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేసిన ఎంఎస్‌ఐ

MSI-Gamimg-laptop

ముంబయి: ప్రముఖ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు ఎంఎస్‌ఐ తన నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లు జిఎఫ్63, పిఎస్42 లను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. వీటిలో ఇంటెల్ కోర్ ఐ7 8వ జనరేషన్ ప్రాసెసర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్‌ఐ జిఎఫ్63 ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచుల డిస్‌ప్లే, ఎన్‌వీడియా జిఫోర్స్ జిటిఎక్స్ 1050 టిఐ గ్రాఫిక్స్, 10 గంటల బ్యాటరీ బ్యాకప్ సౌకర్యం కలదు. అంతేకాకుండా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ తదితర అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.79,990లకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. అలాగే ఎంఎస్‌ఐ పిఎస్42 ల్యాప్‌టాప్‌ను రూ.77,990 ధరకు నూతన గేమింగ్ ల్యాప్ టాప్ ను అందిస్తున్నారు.

Comments

comments