Search
Sunday 23 September 2018
  • :
  • :

ఎంఎస్‌ఎంఇ అవార్డ్‌లకు ఆహ్వానం

MSME

మన తెలంగాణ/బాలానగర్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్ర మలకు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ప్రకటించే అవార్డ్‌ల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి16 చివరి తేది అని ఎంఎస్‌ఎంఇ అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్ కుమార్ తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రతి సంవత్సరం జాతీ య స్థాయిలో వివిధ కేటగిరిలలో అత్యుత్తమ ఉత్పత్తి దారులు, ఉత్పత్తి మరియు ప్రాసెస్, తయారు చేసే విధానంలో ఆధునీకరణ పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలను పాటించే విధానం, ఎగుమ తులలో అనుసరించే విధానం వంటి అంశాలలో అవార్డ్‌ల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి16 చివరి తేది అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. వివరాలకు www.dcmsme.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి సూచనలు అప్లికేషన్ ఫార్మ్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు ఎంఎస్ ఎంఇ అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్ కుమార్ సెల్ నెంబర్ 99662 94645కు కాల్‌చేసి సంప్రదించ గలరని ఆయన అన్నారు.

Comments

comments