Search
Friday 16 November 2018
  • :
  • :

ముదిరాజ్‌లు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి

Itala-Rajendar-image

రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/కరీంనగర్‌క్రైం: ముదిరాజ్‌లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని జ్యోతిభాపూలే (సర్కస్) గ్రౌ ండ్‌లో జిల్లా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాశ్‌ముదిరాజ్‌కు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా విచ్చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మా ట్లాడుతూ ముదిరాజ్‌లు అక్షరాస్యత సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ముదిరాజ్‌లు రాజకీయంగాఎదిగిన రోజు సమస్యలను అధిగమించే ఆవకా శం ఉంటుందన్నారు.విబేధాలకు తావివ్వకుండా ఐకమత్యంతో ముందుకు వెళితే అభివృద్ధి చెందుతారని పేర్కొన్నా రు. జాతి అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుకు పయనించాలని సూచించారు. ముదిరాజ్‌లను బిసి డి నుండి బిసి ఎ లోనికి మార్చే ప్రక్రియ సాగుతుందని అతి త్వరలోనే ముదిరాజ్‌లు శుభవార్త వింటారని తెలిపారు. ముదిరాజ్‌ల రాజకీయ ఎదుగుదలకు టిఆర్‌ఎస్ పార్టీ ఆవకాశం కల్పిస్తుందని ఇందుకోసం ముఖ్యంగా యువత సిద్ధంగా ఉండాలని వారిలో చైతన్యం వచ్చిన రోజు ముదిరాజ్‌ల బతుకులు మా రుతాయని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో పాల్గొని చట్టాల ను తయారుచేసే స్థాయికి ముదిరాజ్‌లు చేరుకోవాల్సిన అ వసరం ఉందన్నారు. రాజ్యాధికారం సాధించాల్సిన అవస రం ఉందని ఆయన స్పష్టం చేశారు. సామాజికంగా, రాజకీయంగా ఎదిగిన రోజు ఏవరి ముందు చేతులు కట్టుకోని నిలబడాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సన్మాన గ్రహీత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాశ్‌ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు. ముదిరాజ్‌ల ఎదుగుదలకు రాష్ట్ర మ ంత్రి ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావులు చేస్తున్న కృషిని మరువలేనిదని తెలిపారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గుర్రాల మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, ఎంఎల్‌ఎలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, పుట్ట మధు, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్, సుడా చై ర్మన్ జి.వి.రామకృష్ణారావు, జడ్‌పిటిసి శరత్‌రావు, డిప్యూ టీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, ముదిరాజ్ నాయకులు శంకర్, పిట్టల రవీందర్, కోలకాని నర్సయ్య, రంగరవేని ల క్ష్మణ్, పిట్టల లింగయ్య,పొలు లక్ష్మణ్, బల్ల సత్తయ్య, కొ లిపాక మల్లికార్జున్, బండారి భుమేష్, పండగ నాగరాజు, కోడి అంతయ్య, సంపూర్ణ, వరలక్ష్మి, మంజుల, నాగమణి, రమాదేవి, నీలం పెద్దన్న, శ్రీనివాస్, పండగ బాలు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments