Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మహ్మద్ అనాస్‌ యహియాకు స్వర్ణం

Muhammed Anas betters own 400m Indian record in Czech Republic

చెక్‌ రిపబ్లిక్‌: భారత స్టార్ స్ప్రింటర్ మహ్మద్ అనాస్‌ యహియా 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం గెలిచాడు. చెక్‌ రిపబ్లిక్‌లో శనివారం జరిగిన 400 మీటర్ల రేసుని మహ్మద్‌ కేవలం 45.24 సెకన్లలోనే పూర్తి చేసి ఇండియాకి గోల్డ్ మెడల్ అందించాడు. ఇదే ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో 400 మీటర్ల రేసుని 45.31 సెకన్లలో పూర్తి చేసిన అనాస్‌ కొద్దిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. అంతేగాక 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కాసింగ్‌ బంగారు పతకాన్ని గెలుపొందగా, ఆ తర్వాత మళ్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్‌కి చేరిన రెండో భారత అథ్లెట్‌గా మహ్మద్‌ నిలిచిన విషయం తెలిసిందే.

Comments

comments