Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

జియోఫోన్ 2, జియో గిగాఫైబర్, జియో గిగాటివి

jo

ఈ మూడింటి గురించి మీరు తెల్సుకోవాల్సినవి..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గురువారం జియో ఫోన్2, జియో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్(జియో గిగాఫైబర్), జియో డిజిటల్ టివి సర్వీసెస్(జియో గిగాటివి సెట్ టాప్ బాక్స్)లను ఆవిష్కరించారు. వీటితో పాటు జియో ఫోన్లను అప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. వాట్సాప్‌తో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను జియో ఫోన్‌లో అందిస్తున్నామని ఆయన ప్రకటించారు.
జియో ఫోన్ 2
* జియో ఫోన్ లాగే జియో ఫోన్ 2 కూడా కైయోస్ ఆధారిత 4జి వోల్ట్ ఆధారిత ఫీచర్ ఫోన్
* అయితే పూర్తిగా క్వర్టీ కీబోర్డ్, విస్తృత స్క్రీన్
* 240X320 పిక్సెల్ రిజల్యూషన్‌తో 2.4 అంగుళాల తెర
* 512 ఎంబి ర్యామ్
* 4జిబి ఇంటర్నల్ స్టోరేజ్
* 128జిబి ఎక్స్‌టర్నల్ మెమొరీ
* కెఎఐ ఒఎస్, వైఫై, జిపిఎస్, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, ఎఫ్‌ఎం
* వెనుక 2 మెగాపిక్సెల్, ముందు వైపు విజిఎ కెమెరాలు
* ఆగస్ట్ 15 నుంచి జియో ఫోన్‌లో వాట్సాప్, యూట్యూబ్
* పాత జియో ఫోన్ ఇచ్చేసి రూ. 501 చెల్లించడం ద్వారా జియోఫోన్2
* జూలై 21 నుంచి జియో ఫోన్2 కు మార్చుకునే అవకాశం
* ఆగస్ట్ 15 నుంచి జియో ఫోన్2 కమర్షియల్ విక్రయాలు
* 2000ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యం
* జియో ఫోన్2కు ధర రూ. 2999గా నిర్ణయం
జియో గిగాఫైబర్
ఎంపిక చేసిన పట్టణాల్లో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ముఖేష్ అంబానీ గురువారం జియో ఫిక్స్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌ను ప్రకటించారు. దీనిని ఇళ్లు, వ్యాపారులు, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, పెద్ద సంస్థల కోసం ఏకకాలంలో 1,100 పట్టణాల్లో ప్రారంభించారు. కంపెనీ తెలిపిన ప్రకారం, జియో గిగాఫైబర్ సేవలను ఒక జిబిపిఎస్(గిగాబైట్ పర్ సెకండ్)కు ఇంటర్నెట్ వేగం ఉండనుంది. దీని లాంఛ్ తేదీ, ప్రణాళికను కంపెనీ ప్రకటించలేదు. అయితే ఆసక్తి కల్గినవారు ఆగస్టు 15 నుంచి జియో గిగాఫైబర్ కోసం జియో వెబ్‌పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ప్రాంతాల్లో తొలి బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందుతాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
జియో గిగాటివి
గిగాఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్‌లో భాగంగా జియో డిజిటల్ టెలివిజన్ కంటెంట్ సేవలు ఉంటాయి. జియో యాప్ సూట్ యాక్సెస్‌తో పాటు ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ కంటెంట్ సేవలను గిగాటివి సెట్‌టాప్‌బాక్స్ ఆఫర్ చేస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే సెట్‌టాప్‌బాక్స్ వీడియో కాలింగ్ ఫీచర్‌కు కూడా సఫోర్ట్ చేస్తోంది. ఇది టెలివిజన్ నుంచి వినియోగదారులకు వీడియో కాల్స్‌కు సపోర్ట్ చేస్తుంది. గిగాటివి రిమోట్ వాయిస్ ఆధారితంగా ఉంటుంది.

Comments

comments