Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం

ఘనంగా మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ జన్మదిన వేడుకలు

Mukhesh-Goud

మన తెలంగాణ/హైదరాబాద్: కార్యర్తల అభీష్టంమేరకు తన రాజకీయ నిర్ణయం ఆధారపడి ఉం టుందని కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ అన్నారు. తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేది తన కార్యకర్తలేనని, వారి ఆదేశాలను శిరసావహిస్తానని ప్రకటించారు. తన రాజకీయ జీవితం కార్యకర్తలు పెట్టిన భిక్షగా అభివర్ణించారు. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జన్మదిన వేడుకలకు పిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మా జీ మంత్రి డి.కె.అరుణ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో పాటు టిఆర్‌ఎస్ హైదరాబాద్ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు, వివిధ పార్టీలకు చెందిన 30 మంది కార్పొరేటర్లు ముఖేష్‌గౌడ్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖేష్‌గౌడ్ మాట్లాడుతూ తన ను నీడలా కాపాడుకుంటున్న కార్యకర్తల రుణా న్ని ఏ జన్మలోనూ తీర్చుకోలేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తనకు ఎంతో ఫాలోయింగ్ ఉన్నదని, తన కార్యకర్తలు, బిసి కులాలతో మాట్లాడిన తర్వాతనే వారి అభీష్టం మేరకు తన నిర్ణయం ఉంటుందని ఆయన మీడియాకు వివరించారు. త్వరలోనే డివిజన్ల వారిగా కార్యకర్తలతో సమావేశమవుతానని స్పష్టం చేశారు.

ముఖేష్‌గౌడ్‌తో మైనంపల్లి హన్మంతరావు భేటీ : కాంగ్రెస్ నేత ముఖేష్‌గౌడ్‌తో టిఆర్‌ఎస్ హైదరాబాద్ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు ఆదివారం భేటీ అయ్యారు. ముఖేష్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన క్యాం ప్ ఆఫీసుకు వచ్చిన మైనంపల్లి అక్కడే కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖేష్‌గౌడ్ టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరగడం, తాను పార్టీని వీడడం లేదని ముఖేష్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. కాగా ముఖేష్ జన్మదిన వేడుకలకు వచ్చిన మైనంపల్లి ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రధాన్యత సంతరించుకున్నది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పిసిసి అధ్యక్షు లు ఉత్తమ్ కూడా ముఖేష్‌గౌడ్‌ను కలసి గాంధీభవన్‌లో మాట్లాడుకుందాం రమ్మని ముఖేష్‌ను ఉత్తమ్ ఆహ్వానించినట్లు తెలిసింది.

Comments

comments