Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కట్టుదిట్టంగా ముంబయి బౌలింగ్.. సన్‌రైజర్స్ 158/8

David-Warner-Out

ముంబయి : వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లును భారీ స్కోర్ చేయకుడా కట్టడి చేశారు. ముంబయి టాస్ గెలవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (48), డేవిడ్ వార్నర్ (49) మినహా మిగితా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఒక దశ బెన్ కట్టింగ్ (20) కాస్త నిలకడగా ఆడుతున్నట్లు కనిపించినా బు్రమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవ్వడంతో జట్టు తిరిగి కష్టాల్లో పడింది. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ముంబయి బౌలింగ్‌లో బుమ్రా 3, హర్భజన్ 2, మలింగా, పాండ్య, మెక్‌క్లీన్‌గాన్ చెరో వికెట్ తీశారు.

Comments

comments