Home IPL 2019 ముంబయి హ్యాట్రిక్ గెలుపు

ముంబయి హ్యాట్రిక్ గెలుపు

Mumbai hat-trick win

కోల్‌కతా: ఐపిఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ వరుసగా మూడో విజయం సాధించింది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంయి 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన 21 బంతుల్లోనే ఆరు భారీ సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 62 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (36), కెప్టెన్ రోహిత్ శర్మ (36), బెన్ కటింగ్ (24) కూడా తమవంతు పాత్ర పోషించడంతో ముంబయి భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.1 ఓవర్లలో కేవలం 108 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ముంబయి బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. హార్దిక్ పాండ్య, మయాంక్ మార్కండే, కృనాల్ పాండ్య, బుమ్రాలు పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా జట్టులో ఏ ఒక్కరూ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేక పోయారు. క్రిస్ లిన్ (21), నితీష్ రానా (21) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో కోల్‌కతాకు మరో ఓటమి తప్పలేదు.