Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పుణె టార్గెట్ 130

Jayadev-Unadkat

హైదరాబాద్ : ఐపిఎల్ 10భాగంగా రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు పుణె బౌలర్ల ధాటికి కుప్ప కూలిపోయారు. ప్రారంభం నుంచే ముంబయి ఆటగాళ్లను భారీ స్కోర్ చేయనీయకుండా పుణె బౌలర్లు కట్టడి చేశారు. పేసర్లు ఉనద్కత్, క్రిస్టేయిన్, జంపా తమ బౌలింగ్ తో ముంబయి బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించారు. 8 పరుగుల వద్దే ముంబయి జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ అంబాటి రాయుడితో కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత ఫెర్గుసన్ బౌలింగ్ లో రాయుడు (12) రనౌట్ రూపంలో వెనుదిరిగాగడు. తర్వాత 10.1 ఓవర్లో రోహిత్ శర్మ 24 పరుగులు చేసి క్యాచౌట్ అయ్యాడు. ఆ తర్వాత ముంబయి వరుసగా కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కృనాల్ పాండ్య (47) జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు ప్రయత్నం చేశాడు. కాగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబయి 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. పుణె బౌలింగ్ లో ఉనద్కత్, క్రిస్టేయిన్, జంపా చెరో రెండు వికెట్లు తీశారు.

Comments

comments