Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రోహిత్ రఫ్ఫాడించాడు!

Rohit

5 వికెట్ల తేడాతో ముంబయి విజయం
కోహ్లిసేనకు తప్పని ఓటమి

ముంబయి: ముంబయి ఇండి యన్స్ మరోసారి సత్తా చాటింది. 163 పరుగుల లక్ష ఛేదనలో రోహిత్ శర్మ (37 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) 56 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసి అజే యంగా నిలిచిన వేళ.. 5 వికెట్ల తేడాతో బెంగళూరును ముంబ యి చిత్తుగా ఓడించింది. 19.5 ఓవర్లలో ఒక బంతి మిగిలి ఉండ గానే రోహిత్‌సేన 5 వికెట్ల నష్టాని కి 165 పరుగులు చేసి వరుసగా మరో విజయాన్ని సొంతం చేసు కుంది. మరోవైపు బౌలింగ్ విభా గంలో ముంబయి ఆటగాడు మెక్లెనగన్ అద్భుతంగా రాణించ డంతో బెంగళూరు ఆటగాళ్ల కీల క మూడు వికెట్లు పడగొట్టి భారీస్కోరు చేయకుండా కట్టడి చేశా డు. ఈ సీజన్‌లో కోహ్లిసేనకు 8వ ఓటమి కాగా, ముంబయికి 8వ విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ముంబయికి 2 పాయింట్లు దక్కగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలి చింది. ముంబయి ఓపెనర్లలో పార్థీవ్ పటేల్ ఖాతా తెరవ కుం డానే ఆదిలోనే చేతులేత్తేయగా, బట్లర్ (33), నితీశ్ రాణా (27) పరుగులతో పర్వాలేదనిపించారు. పోలార్డ్ (17), కర్ణ్ శర్మ (9), క్రునాల్ పాండ్య (2) పరుగులతో రిటైర్డ్ హర్ట్ నాటౌట్‌గా నిష్క్రమించాడు. హర్థీక్ పాండ్య (14) పరుగులతో నాటౌట్‌గా నిలి చాడు. బెంగళూరు బౌలర్లలో నేగీ రెండు వికెట్లు తీసుకోగా, వాట్సన్, చౌదరీ, చాహ ల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ముంబయి కెప్టెన్ రోహిత్‌శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

నిరాశతో కోహ్లిసేన..
సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు మరోసారి నిరాశపర్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఊహించని రీతిలో కోహ్లి (14 బంతుల్లో 2 సిక్స్) 20 పరుగులకే సరిపెట్టుకుని అందరిని నిరాశపర్చాడు. మెక్లెనగన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన విరాట్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మన్‌దీప్ సింగ్ (17), హెడ్ (12), డివిలియర్స్ 43 పరుగులు చేశాడు. కేదార్ జాదవ్ (28), వాట్సన్ (3), పవన్ నేగి 35 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి, ప్రత్యర్థి ముంబయికి 163 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబ యి బౌలర్లలో మెక్లెనగన్ 3 వికెట్లు తీసుకోగా, క్రునాల్ పాండ్య 2 వికెట్లు, కర్ణ్ శర్మ, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: విరాట్ కోహ్లి (సి) రోహిత్‌శర్మ (బి) మెక్లెనగన్; 20, మన్‌దీప్ సింగ్ (సి) హర్ధీక్(బి) కర్ణ్ శర్మ; 17, హెడ్ (సి) హర్థీక్ (బి) క్రునాల్; 12, డివిలియర్స్ (సి) బుమ్రా (బి) క్రునాల్; 43, కేదార్(సి) పోలార్డ్ (బి) మెక్లెనగన్; 28, వాట్సన్ (బి) బుమ్రా; 3, (సి) పోలార్డ్ (బి) మెక్లెనగన్; 35, మిల్నె నాటౌట్; 0, శ్రీనాథ్ రనౌట్ ( పటేల్); 0. ఎక్స్‌ట్రాలు: 4. మొత్తం: (20 ఓవర్ల లో 8 వికెట్లు) 162 పరుగులు. వికెట్ల పతనం: 1-31, 2-40, 3-85, 4-102, 5-108, 6-102, 7-162, 8-162. ముంబయి బౌలర్లు: మెక్లెన గన్ 4-0-34-3, మలింగ 4-0-31-0, హర్థీక్ కర్ణ్ శర్మ 3-0-23-1, బుమ్రా 4-0-33-1, క్రునాల్ 4-0-34-2.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: పార్థీవ్(సి) చాహల్ (బి) అంకిత్ ; 0, బట్లర్ (సి) హెడ్ (బి) నేగి; 33, నితీశ్ (సి) హెడ్ (బి) నేగి; 27, రోహిత్ నాటౌట్; 37, పోలార్డ్ (సి) హెడ్ (బి) చాహల్; 17, క్రునాల్ రిటైర్డ్ హర్ట్ నాటౌట్; 2, కర్ణ్ శర్మ (సి) మిల్నె (బి) వాట్సన్; 9, హర్థీక్ నాటౌట్; 14. ఎక్స్‌ట్రాలు:7. మొత్తం: (19.5 ఓవర్లలో 5 వికెట్లు) 165 పరుగులు. వికె ట్ల 1-0, 2-61, 3-70, 4-98, 4-101, 5-130. బెంగళూ రు బౌలర్లు: అంకిత్ 4-0-32-1, చాహల్ 4-0-36-1, మిల్నె 2-0-29-0, శ్రీనాథ్ 2-0-21-0,వాట్సన్ 3.5-0-28-1, నేగి 4-0-17-2.

Comments

comments