Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఆర్ సిబి పై ముంబయి ఇండియన్స్ విజయం

mumbai-Indians

బెంగళూరు: చిన్న స్టేడియంలో ముంబయి ఇండియన్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఆర్ సిబిలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఒంటరిగా పోరాడి 62 పరుగులు చేయగా, గేల్ (22), డివిలియర్స్ (19), నాగి (13) పరుగులు చేశారు.

ముంబయి ఇండియన్స్ తొలి నాలుగు వికెట్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. కానీ క్రీజులోకి వచ్చిన పోలార్డ్ 47 బంతుల్లో 70 పరుగులు చేసి విజయ తీరానికి చేర్చే సమయంలో ఛాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇద్దరు పాండ్యాలు క్రీజులో చివరి వరకు నిలకడగా ఆడటంతో ముంబయి ఇండియన్స్  గెలిచింది.

Comments

comments