Search
Friday 16 November 2018
  • :
  • :

ఛాంపియన్ ముంబయి

బుమ్రా, జాన్సన్ మ్యాజిక్, ఫైనల్లో పుణెకు ఝలక్, స్మిత్ పోరాటం వృథా

miహైదరాబాద్: ఐపిఎల్ పదో సీజన్‌లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ముంబయి ఒక పరుగు తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ను ఓడించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో ముంబయి అసమాన ఆటతో విజేతగా నిలిచింది. మిఛెల్ జాన్సన్ చివరి ఓవర్లో కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. ఐపిఎల్‌లో విజేతగా నిలువడం ముంబయికి ఇది మూడోసారి. కెప్టెన్ స్మిత్ (51), అజింక్య రహానె (44) పరుగులు చేసినా జట్టును గెలిపించలేక పోయారు.
ఉనద్కట్ దెబ్బ..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ముంబయి ఇండియన్స్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. జైదేవ్ ఉనద్కట్ అద్భుత బౌలింగ్‌తో ముంబయి ఓపెనర్లు ఇద్దరిని తక్కువ స్కోరుకే పెవిలియన్ పంపాడు. తొలుత పార్థివ్ (4)ను ఉనద్కట్ ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో మరో ఓపెనర్ లెండిల్ సిమన్స్ (౩) కూడా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో ముంబయి 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ, అంబటి రాయుడు తీసుకున్నారు. అయితే పుణె బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులకు బ్రేక్ వేశారు. దీంతో స్కోరును పెంచే క్రమంలో రాయుడు(12) రనౌటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ (24; 22 బంతుల్లో 4×4) కూడా పెవిలియన్ చేరాడు.
కృనాల్ ఒంటరి పోరాటం..
ఒకవైపు వికెట్లు పడుతున్నా యువ ఆటగాడు కృనాల్ పాండ్యా తన పోరాటాన్ని కొనసాగించాడు. పొలార్డ్ (7), హార్దిక్ పాండ్యా (10)లు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. మరోవైపు కృనాల్ చూడచక్కని షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కృనాల్ 38 బంతుల్లో మూడు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 47 పరుగులు చేసి చివరి బంతికి రనౌటయ్యాడు. దీంతో ముంబయి స్కోరు నిర్ణీత ఓవర్లలో 8వికెట్లకు 129 పరుగులకు చేరింది. పుణె బౌలర్లలో ఉనద్క్, జంపా, క్రిస్టియన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Comments

comments