Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

గుజరాత్ లయన్స్ పై ముంబయి ఇండియన్స్ గెలుపు…

Mumbai-Indians

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ పై ముంబయ ఇండియన్స్ విజయం సాధించింది. 19.3 ఓవర్లలో ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్లు కోల్పోయి గుజరాత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్నిచేరుకుంది. ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మెన్లలో రానా (53), కెప్టెన్ రోహిత్ శర్మ (40) , పోలార్డ్ (39), బట్లర్ (26), పార్థీవ్ పటేల్ పరులేమి చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. గుజరాత్ లయన్స్ బౌలర్లలో టై రెండు వికెట్లు తీసుకోగా, పటేల్, పవన్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాట్స్ మెన్లలో మెకకల్లమ్ (64), దినేష్ కార్తీక్ (48), సురేష్ రైనా (28), రాయ్ (11), ఇసాన్ కిసాన్ (11), స్మిత్ పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో మెగ్లాన్ రెండు వికెట్లు తీసుకోగా, మలింగ, హర్బజన్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Comments

comments