Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పంజాబ్‌కు ముంబయి షాక్

mumb

ఇండోర్: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో కింగ్స్ లెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్ మరోసారి మెరుపులు మెరిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గేల్ రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 50 పరుగులు సాధించాడు. చివర్లో స్టోయినస్ రెండు సిక్స్‌లు, మరో రెండు బౌండరీలతో అజేయంగా 29 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ గౌరవప్రద స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ మరో ఓవర్ మిగిలివుండగానే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో వేగంగా 57 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన కృనాల్ 12 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో అజేయంగా 31 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర 24 పరుగులతో అజేయంగా ఉన్నాడు.

Comments

comments