Search
Wednesday 14 November 2018
  • :
  • :

ముంబయి జైత్రయాత్ర…

వికెట్ల తేడాతో పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్ హూహుగస్థానంలో నిలిచిన రోహిత్‌సేన
తొలి సెంచరీతో ఆకట్టుకున్న బట్లర్, నితీశ్ రాణా

mumbai-Indians

ఇండోర్ : ఐపిఎల్ 10వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబయి సాధించింది. గురువారం ఇక్కడ ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడి యంలో ముంబయి ఆటగాళ్లు బట్లర్, నితీశ్ రాణా విజృంభించడంతో 15.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి రోహిత్‌సేన మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో ముంబయికి 2 పాయింట్లు దక్కాయి. దీంతో పాయింట్ల పట్టికలో రోహి త్‌సేన అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది.

199 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ జట్టు లక్ష ఛేదనలో మెరిసింది. తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఆటగాళ్లు పార్థీవ్ పటేల్, బట్లర్ ముంబయికు మంచి శుభారంభాన్ని అందించారు. ఇరువురి భాగస్వామ్యంలో ముంబయి జట్టులో తొలి వికెట్‌కు 23 బంతుల్లో 50 పరుగులు జోడించారు. ఒక దశలో పార్థీవ్‌కు స్టాయినిస్ చెక్ పెట్టేయడంతో 37 పరుగులకే తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. మరో ఓపెనర్ బట్లర్ (37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 77 పరుగులు సాధించి హాఫ్ సెంచరీతో చేశాడు. ఒక దశలో మోహిత్ శర్మ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. పార్థీవ్ స్థానంలో వచ్చిన నితీ శ్ రాణా (34 బంతుల్లో 7 సిక్స్) 62 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసి అజేయంగా నిలిచాడు. హార్థీక్ పాండ్య (15) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ, స్టాయినిస్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన ముంబయి ఆటగాడు బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
పంజాబ్‌కు మరో ఓటమి..: ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మరో పరాజయాన్ని మూట గట్టుకుంది. పంజాబ్ జట్టు ఓపెనర్ హాసీమ్ ఆమ్లా, మ్యాక్స్‌వెల్ విజృంభిం చినప్పటికీ పంజాబ్ బౌలింగ్‌లో ముంబయిని కట్టడి చేయలేకపోయింది.

తొలు త టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ జట్టు ఓపెనర్లుగా ఆమ్లా, మార్ష్‌లు బరిలోకి దిగారు. వీరిద్దరూ పంజాబ్‌కు మంచి శుభారంభాన్ని అందించగా, 26 పరుగులు చేసిన షాన్ మార్ష్ తొలి వికెట్‌గా నిష్క్రమించాడు. ఆ తరువాత వచ్చినవృద్ధిమాన్ సాహా (11) పరుగులకే వెనుదిరిగాడు. అతని స్థానంలో కెప్టెన్ మ్యాక్స్‌వెల్ పగ్గాలు అందుకున్నాడు. ఆమ్లాకు జతగా మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌ను ఝళిపించాడు. వీరిద్ద రూ కలిసి మూడో వికెట్‌కు 22 బంతుల్లో 50 పరుగు లు జోడించారు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ ఆమ్లా అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబయి బౌలర్లకు చుక్కలు చూపించాడు. (60 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్) సెంచ రీ నమోదు చేసిన ఆమ్లా 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాక్స్‌వెల్, ఆమ్లాలు ఇద్దరూ దూకుడుగా ఆడుతూ పంజాబ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన క్రమంలో మ్యాక్స్‌వెల్‌కు పంజాబ్ బౌలర్ బుమ్రా చెక్ పెట్టేశాడు. దీంతో మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్) 40 పరుగులు చేసి మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన స్టోయినీస్ (1) పరు గు మాత్రమే చేసి చేతులేత్తేశాడు. అక్సర్ పటేల్ (4), ఆమ్లా (104) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు ముంబయి ఇండి యన్స్‌కు 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, పంజాబ్ బౌలర్లలో మెక్లేనగన్ రెండు వికెట్లు తీసుకోగా, క్రునాల్ పాండ్య, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు.

శతక్కొట్టిన ఆమ్లా..

ఓపెనర్ ఆమ్లా అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. బౌలింగ్ విభాగంలో పరిణితి చెందిన ముంబయి బౌలర్లకు ఆమ్లా చుక్కలు చూపించాడు. ఆమ్లాకు తోడుగా కెప్టెన్ మ్యాక్స్‌వెల్ కూడా విజృంభించాడు. ఈ మ్యాచ్‌లో ఆది నుంచి చివరి వరకు ఒంటరిపోరాటం చేస్తూ ఆమ్లా శతకాన్ని పూర్తి చేశాడు. ముంబయి పేసర్లు విసిరిన బంతులను ఆచితూచి ఆడుతూ ఎక్కడా కూడా తనదైన శైలిలో బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. దీంతో ఈ సీజన్‌లో సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా ఆమ్లా రికార్డు సృష్టించాడు.

మెక్లనగన్ వేసిన 15వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ ఏకంగా 28 పరుగులు రాబట్టగా, అనంతరం ఓవర్‌లో ఆమ్లా చెలరేగిపోయాడు. మలింగ బౌలింగ్‌లో రెండో బంతిని స్టేడియం బయటకు పంపిన ఆమ్లా 20 పరుగులు రాబట్టి తనదైన మార్క్‌ను చూపించాడు. వీరద్దరి దూకుడుపై కన్నేసిన బౌలర్ బుమ్రా 16.3 ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో భాగస్వామ్యానికి తెరపడింది. అయినప్పటికీ ఆమ్లా ఏమాత్రం దూకుడు తగ్గించుకుండా విజృంభించి టి20 కెరీర్‌లో తొలి శతకాన్ని ఆమ్లా నమోదు చేశాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా నాటౌట్ ; 104, షేన్ మార్ష్ (సి) పోలార్డ్ (బి) మెక్లనగన్; 26, వృద్ధిమాన్ సాహా (బి) క్రునా ల్ పాండ్య; 11, మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా; 40, స్ట్టాయినిస్ (సి) పోలార్డ్ (బి) మెక్ల్లనగన్; 1, అక్సర్ పటేల్ నాటౌట్; 4. ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లు) 198 పరుగులు. వికెట్ల పతనం: 1-46, 2-80, 3-163, 4-166. ముంబయి బౌలర్లు : హర్థీక్ పాండ్య : 2-0-18-0, మెక్లనగన్ 4-0-46-2, హర్భజన్ సింగ్ 2-0-12-0, మలింగ 4-0-58-0, క్రునాల్ పాండ్య 4-0-29-1, బుమ్రా 4-0-30-1.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టాయినిస్ ; 37, జెసి బట్లర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) మోహిత్ శర్మ ; 77, నితీశ్ రాణా నాటౌట్ ; 62, హర్థీక్ పాండ్య నాటౌట్; 15 ఎక్స్‌ట్రాలు: 8. మొత్తం: ( 15.3 ఓవర్లలో 2 వికెట్లు ) 199 పరుగులు. వికెట్ల పతనం: 1-81, 2-166. పంజాబ్ బౌలర్లు : సందీప్ శర్మ 3-0-39-0, ఇషాంత్ శర్మ 4-0-58-0, మోహిత్ శర్మ 2.3-0-29-1, స్టాయినిస్ 2-0-28-1, అక్సర్ పటేల్ 2-0-20-0, స్వప్నిల్ సింగ్ : 2-0-22-0.

Comments

comments