Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ముంబయి ‘సూపర్’ విన్

  • మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌లో తేలిన ఫలితం

MI-GL

రాజ్‌కోట్: గుజరాత్ లయన్స్, ముంబయి ఇండియన్స్ మధ్య రాజ్‌కోట్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ముంబయి గెలిచింది. రైనాసేన నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబయి ఇండియన్స్ తడబడి వెనువెంటనే కీలక వికెట్లను చేజార్చుకుని ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ముంబయి బ్యాట్స్‌మెన్ చేతులేత్తేశారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ముంబయి ఆటగాళ్లలో పార్థీవ్ పటేల్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) 70 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆది నుంచి నిలకడగా ఆడుతున్న క్రమంలో ఫాల్కనర్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పార్థీవ్ నిష్క్రమించాడు. మరో ఓపెనర్ బట్లర్ పరుగు తీసే క్రమంలో (9) పరుగులకే రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బట్లర్ స్థానంలో వచ్చిన నితీశ్ రాణా (19), కెప్టెన్ రోహిత్ శర్మ (5), పోలార్డ్ (15), హర్థీక్ పాండ్య (4), హర్భజన్ సింగ్ (0), మెక్లెనగన్ (0), బుమ్రా (0) పరుగులకే చేతులేత్తేయగా, క్రునాల్ పాండ్య (28), మలింగ (0) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన ముంబయి ఆలౌట్ అయింది. కాగా, గుజరాత్ బౌలర్లలో ఫాల్కనర్, బసిల్ థంపి రెండు వికెట్లు తీసుకోగా, అంకిత్ సోని ఒక వికెట్ తీసుకున్నాడు.
కిషన్, జడేజా రాణించినా..
గుజరాత్ లయన్స్ జట్టు మరోసారి పేలవ ప్రదర్శనతో చతికలబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన గుజరాత్ లయన్స్ 153 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు ముంబయికి 154 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ జట్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఇషాన్ కిషాన్ ఒక్కడే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోగలిగాడు. 10 ఓవర్లు ముగిసే వరకు కిషన్ ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. మొత్తం (35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) 48 పరుగులు చేసిన కిషన్ హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఆగిపోయాడు. హర్భజన్ బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చిన ఇషాన్ అనూహ్యంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పటికే మరో ఓపెనర్ మెక్‌కలమ్ (6), కెప్టెన్ సురేశ్ రైనా (1), ఫించ్ (0), దినేశ్ కార్తీక్ (2) పేలవ ప్రదర్శనతో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం వచ్చి రవీంద్ర జడేజా (28) పరుగులతో పర్వాలేదనిపించగా, క్రునాల్ పాండ్య బౌలింగ్‌లో పటేల్ స్టంప్ ఔట్ చేయడంతో వెనుదిరిగాడు. మిగతా ఆటగాళ్లలో ఫాల్కనర్ (21), ఇర్ఫాన్ పఠాన్ (2), ఆండ్రూ టై (25) పరుగులు చేయగా, బసిల్ థంపి (2), అంకిత్ సోని (7) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో క్రునాల్ పాండ్య మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రా రెండు వికెట్లు, హర్భజన్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
స్కోరు బోర్డు వివరాలు..
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్ : ఇషాన్ కిషాన్ (సి) పోలార్డ్ (బి) హర్భజన్ సింగ్; 48, మెక్‌కలమ్ (బి) మలింగ; 6, సురేశ్ రైనా (సి) పోలార్డ్ (బి) బుమ్రా; 1, ఫించ్ (బి) మలింగ; 0, దినేశ్ కార్తీక్ స్టంప్ పటేల్ (బి) క్రునాల్ పాం డ్య; 2, రవీంద్ర జడేజా (సి)&(బి) క్రునాల్ పాండ్య; 28, ఫాల్కనర్ (బి) బుమ్రా; 21, ఇర్ఫాన్ పఠాన్ (సి) హార్థీక్ పాండ్య (బి) క్రునాల్ పాండ్య; 2, ఆండ్రూ టై రనౌట్ (బుమ్రా); 25, బసిల్ థంపి నాటౌట్;2, అంకిత్ సోని నాటౌట్; 7. ఎక్స్‌ట్రాలు: 8. మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లు) 150 పరుగులు. వికెట్ల పతనం: 1-21, 2-46, 3-48, 4-56, 5-83, 6-95, 7-101, 8-144, 9-144. ముంబ యి బౌలర్లు: మెక్లెన గన్ 4-0-50-0, మలింగ 4-0-33-2, హర్భజన్ సింగ్ 4-0-23-1, బుమ్రా 4-0-32-2, క్రునాల్ పాండ్య 4-0-14-3.
ముంబయి ఇన్నింగ్స్ : పార్థీవ్ పటేల్ (సి) కార్తీక్ (బి) ఫాల్కనర్; 70, బట్లర్ రనౌట్ (ఫాల్కనర్); 9, నితీశ్ రాణా ఎల్‌బిడబ్లు (బి) అంకిత్ సోని; 19, రోహిత్ శర్మ నాటౌట్; 5, పోలా ర్డ్ (సి) మెక్‌కలమ్ (బి) బసిల్ ; 15, క్రునాల్ పాండ్య రనౌట్ ; 29, హర్థీక్ పాండ్య (సి) ఇషాన్ (బి) బసిల్; 4, హర్భజన్ ఎల్‌బిడబ్లు (బి) బసిల్; 0, బుమ్రా రనౌట్ ; 0, మలింగ నాటౌట్; 0. ఎక్స్‌ట్రాలు: 1. మొత్తం: (20 ఓవర్లలో 10 వికెట్లు) 153 పరుగులు ఆలౌట్. వికెట్ల పత నం: 1-43, 2-82, 3-104, 4-109, 5-127, 6-139, 7-142, 8-143, 9-150, 10-153. గుజరాత్ బౌలర్లు: బసిల్ థంపి 4-0-29-3, ఫాల్కనర్ 4-0-34-2, ఇర్ఫాన్ పఠాన్ 1-0-16-0, అంకిత్ సోని 4-0-16-1, సురేశ్ రైనా 4-0-28-0, ఆండ్రూ టై 1-0-9-0, రవీంద్ర జడేజా 1-0-11-0.

Comments

comments