Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ముంబయి జైత్రయాత్ర…

6 వికెట్ల తేడాతో గుజరాత్‌పై రోహిత్‌సేన విజయం
అర్థ శతకంతో రాణించిన నితీశ్ రాణా

Mumbai Indians won on Gujarat Lions in Indian Premier League, 16th matchముంబయి: ఐపిఎల్ 10 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జైత్రయాత్ర కొన సాగుతోంది. ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా ముంబయి వేదికగా ఆదివార మిక్కడ వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై ముంబయి ఇండియన్స్ 6 వికె ట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. నితీశ్ రాణా, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనతో లక్ష ఛేదన లో ముంబయి మరో విజయాన్ని సొంతం చేసుకుం ది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో లయన్స్‌పై విజయం తో రెండు పాయింట్లు రాగా, మొత్తం 8 పాయింట్లు దక్కాయి. దీంతో పాయింట్ల పట్టికలో ముంబయి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముంబ యి ఆటగాడు నితీశ్ రాణాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గుజరాత్ బౌలర్లలో ఆండ్రూ టై రెండు వికెట్లు తీసుకోగా, ప్రవీణ్ కుమార్, మనఫ్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.

177 పరుగుల లక్ష ఛేదనలో ముంబయి ఆటగాళ్లు నితీశ్ రాణా (36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్) 53 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ముంబయి ఇండియన్స్ లక్ష ఛేదనలో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగు లు సాధించి విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబయి ఆటగాళ్లలో పార్థీవ్ పటేల్ (0), బట్లర్ (26), నితీశ్ రాణా (53), పోలార్డ్ (39), హార్థీక్ (6), కెప్టెన్ రోహిత్ శర్మ (40) నాటౌట్‌గా నిలిచారు. అంతకముందు బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆటగాళ్లలో మెక్‌ల్లామ్ (64), దినేశ్ కార్తీక్ (48 నాటౌట్) అద్భుత ప్రద ర్శనతో ఆకట్టుకున్నారు. లయన్స్ మిగతా ఆటగాళ్లలో కెప్టెన్ రైనా (28), ఇషాన్ (11), డిఆర్ స్మిత్ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరగ గా, జాసన్ రాయ్ (14) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజ రాత్ 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో మెక్లెన గన్ రెండు వికెట్లు తీసుకోగా, మలింగ, హర్భజన్ తలో వికెట్ తీసుకున్నారు.
స్కోరు వివరాలు

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డిఆర్ స్మిత్ (సి) రాణా (బి) మెక్లెనగన్ ; 0, మెక్‌ల్లామ్ (బి) మలింగ; 64, రైనా (సి) శర్మ (బి) హర్భజన్ 28, ఇషాన్ (సి) క్రునాల్ (బి) మెక్లె నగన్ ; 11, కార్తీక్ నాటౌట్; 48, రాయ్ నాటౌట్; 14. ఎక్స్‌ట్రాలు: 11. మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లు) 176 పరుగులు. వికెట్ల పతనం: 1-1, 2-81, 3-99, 4-153. బౌలర్లు : మెక్లెనగన్ 4-0-24-2, మలింగ 4-0-51-1, హర్భజన్ 4-0-22-1, బుమ్రా 4-0-45-0, క్రునాల్ 3-0-18-0, హార్థీక్ 1-0-15-0.

ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : పార్థీవ్ (సి) రాయ్ (బి) కుమార్ ; 0, బట్లర్ (సి) మెక్‌ల్లమ్ (బి) పటేల్ ; 26, నితీశ్ రాణా (సి) కార్తీక్ (బి) టై; 53, రోహిత్ శర్మ నాటౌట్ ; 40, పోలార్డ్ (సి) జడేజా (బి) టై; 39, హార్థీక్ నాటౌట్ ; 6. ఎక్స్‌ట్రాలు: 13. మొత్తం: (19.3 ఓవర్లలో 4 వికెట్లు) 177 పరుగులు. వికెట్ల పతనం: 1-0, 2-85, 3-92, 4-160. బౌలర్లు : ప్రవీణ్ కుమార్ 2.3-0-25-1, బసీల్ 4-0-34-0, మునఫ్ 4–0-35-1, టై 4-0-34-2, జడేజా 4-0-34-0, డిఆర్ స్మిత్ 1-0-12-0.

Comments

comments