Home ఛాంపియన్స్ ట్రోఫీ ఆదిలోనే కష్టాల్లో పడ్డ ముంబయి

ఆదిలోనే కష్టాల్లో పడ్డ ముంబయి

pune

హైదరాబాద్ : ఐపిఎల్-10 ఫైనల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న ఈ ఆఖరి సమరంలో ముంబయి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఆటగాళ్లను పుణె బౌలర్లు కట్టడి చేస్తున్నారు. మూడో ఓవర్ లోనే పేసర్ ఉనద్కత్ బౌలింగ్ లో ముంబయి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 2.1 ఓవర్ వద్ద పార్థీవ్ పటేల్ (4), 2.4 ఓవర్ వద్ద సిమన్స్ (3) పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత ఫెర్గుసన్ బౌలింగ్ లో రాయుడు (12) రనౌట్ రూపంలో వెనుదిరిగాగడు.  దీంతో ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి ముంబయి 3 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (22), కృనల్ పాండ్యా (3) ఉన్నారు.