Home జాతీయ వార్తలు ముంబయి యూనివర్శిటీలో దారుణం…!

ముంబయి యూనివర్శిటీలో దారుణం…!

Student alleges man molested her at MU's Kalina Campus

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి యూనివర్శిటీలో దారుణం జరిగింది. యూనివర్శిటీలోని కలీనా క్యాంపస్ వాష్ రూంలో ఓ ఆగంతకుడు తనను లైంగికంగా వేధించాడని పిజి విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం… గుర్తుతెలియని ఓ వ్యక్తి విద్యార్థినుల వాష్ రూంలోకి చొరబడ్డాడు. ఆ సమయంలో లోపల ఉన్న ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. పట్టపగలే యూనివర్శిటీ ఆవరణలోని వాష్ రూంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో 150 ఏళ్ల చరిత్ర ఉన్న యూనివర్శిటీలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కాగా, సిసిటివి కెమెరాలు లేకపోవడంతో ఆగంతకుడిని గుర్తించ లేక పోయామని వర్శిటీ రిజిస్ట్రార్ దినేష్ కాంబ్లే తెలిపారు. నిందితుడిని గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. విద్యార్థిని ఫిర్యాదు మేర యూనివర్శిటీ రిజిస్ట్రార్ విచారణ జరపాలని వర్శిటీ మహిళా విభాగాన్ని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.