Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పంజాబ్‌పై ముంబయి విజయం

mumbai

 3 పరుగుల తేడాతో గెలుపు కైవసం
ముంబయి: ముంబయి ఇండియన్స్ నిర్దేశించిన అతి తక్కువ స్కోరును కూడా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఛేదించలేకపోయింది. చివరికి 3 పరుగుల తేడాతో పంజాబ్ ఓడిపోయింది. వాంఖడే స్టేడియంలో బుధవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో భాగంగా ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. మొదటి ఓవర్లోనే వికెట్ నష్టపోకుండా 8 పరుగులతో పంజాబ్ జట్టు ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కానీ 3.5 ఓవర్లో మెక్లీగన్ వేసిన బంతిని ఆడిని గేల్(18) కటింగ్‌కు కాచ్ ఔట్ అయ్యాడు. దాంతో ఆరోన్ ఫించ్ క్రీజులోకి వచ్చాడు. రాహుల్, ఫించ్‌లు చాలా బాగా ఆడుతూ 15 ఓవరుకల్లా 67 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యం నిలిపారు. 15.1 ఓవరులో పంజాబ్‌కు కావలసిన రన్‌రేటు ఓవరుకు 12 పరుగులు. 16 ఓవర్లో రాహుల్ విజృంభించి రెండు సిక్సర్లు బాదేసి రన్‌రేట్ తేడాని తగ్గించాడు. కానీ 16.1 ఓవర్లో ఫించ్(46) బుమ్రా వేసిన బంతికి హార్దిక్ పాండ్య చేతిలో క్యాచ్ ఔటయ్యాడు. తర్వాత మార్కస్ స్టోయినిస్ బరిలోకి వచ్చాడు. ఓ ప్రక్క పంజాబ్ జట్టుకు కావలసిన రన్‌రేటు పెరిగిపోతూ ఓవరుకు 12.8 పరుగులు చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో రాహుల్ విజృంభించి ఆడాడు. మూడు బౌండరీలు దంచేశాడు. ఇంకా 9 బంతులుండగా రాహుల్(94) బుమ్రా బంతిలో కటింగ్‌కు కాచ్‌ఔట్ అయ్యాడు. యువరాజ్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన స్థితి. 19.3 ఓవర్లో యువరాజ్ సింగ్(1) మెక్లీగన్ బంతికి లూయిస్ చేతిలో కాచ్ ఔట్ అయ్యాడు. దాంతో మనోజ్ తివారీ క్రీజులోకి వచ్చాడు. కానీ చివరికి పంజాబ్ జట్టు నిర్దారిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులే చేసింది. దాంతో ముంబయి జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది.
దీనికి ముందు టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. పోటీలో ఉన్న మిగతా ఏడు జట్ల కన్నా ముంబయి ఇండియన్స్‌కు నెట్ రన్ రేట్(+ 0.405) బాగుంది. 3 ఓవర్ల వద్ద ముంబయి ఇండియన్స్ స్కోరు వికెట్ నష్టపోకుండా 37 పరుగులుగా ఉంది. కానీ 3.1 ఓవర్లో ఆండ్రూ టై వేసిన బంతికి లెవీస్ డ్రైవ్ ఆడబోయాడు. కానీ బంతి అతడి బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టింది. దాంతో అతడు వ్యక్తిగత 9 పరుగులకు బౌల్డ్ అయ్యాడు. అతడు నిష్క్రమించాక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ క్రీజులోకి దిగాడు. 5.3 ఓవర్లో ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆండ్రూ టై వేసిన మరో నకల్ బాల్‌ను ఆడిన కిషన్ బంతి మిడాన్‌లో ఉన్న స్టోనీస్‌కు కాచ్ పట్టుకున్నాడు. అతడు ఔట్ కాగానే రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. ఆండ్రూ టై వేసిన బంతిని ఆడబోయిన సూర్య కుమార్ యాదవ్ రాహుల్ చేతిలో క్యాచ్ ఔట్‌అయ్యాడు. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ కృనాల్ పాండ్య క్రీజులోకొచాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ముంబయి ఇండియన్స్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 66 పరుగుల వద్ద ఉంది. రాజ్‌పుత్ 8.2 ఓవర్లో వేసిన బంతికి రోహిత్ శర్మ(6)యువరాజ్ చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు. స్ట్రాటజిక్ బ్రేక్ టైమయ్యాక కీరాన్ పొల్లార్డ్ బ్యాటింగ్ వచ్చాడు. ముంబయి ఇండియన్స్ జట్టుకు నేటికీ ఆశలు మిగిలి ఉన్నాయంటే అందుకు కారణం పాండ్య సోదరుల సత్తాయే అని చెప్పాలి. 10వ ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 79 పరుగుల స్కోరు ఉండగా, ఫ్లడ్‌లైట్లు ఆరిపోవడంతో మ్యాచ్‌ను ఆపేశారు. కొన్ని టవర్ల లైట్లు ఆరిపోయాయి. కానీ రాత్రి 9.05 గంటలకు లైట్లు మళ్లీ వెలిగాయి. 12 ఓవర్ల తర్వాత ముంబయి ఇండియన్స్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 104 పరుగులుగా ఉంది. స్టోనీస్ 14.2 ఓవర్లో వేసిన బంతికి కృనాల్ పాండ్య(32) పుల్ ఆడబోయి రాజ్‌పుత్ చేతిలో క్యాచ్‌ఔటయ్యాడు. దాంతో హార్దిక్ పాండ్య బరిలోకి దిగాడు. 15వ ఓవరుకల్లా ముంబయి ఇండియన్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు. అశ్విన్ వేసిన బంతిని పొల్లార్డ్ స్వింగ్ చేస్తే అది నేరుగా ఫించ్ చేతికి క్యాచ్ అయింది. దాంతో ముంబయి జట్టు 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. 17.4 ఓవర్లో అశ్విన్ వేసిన బంతిని కటింగ్ హిట్ కొట్టగా అది కాస్త మిడ్‌వికెట్ వద్ద అక్సర్ చేతికి చిక్కింది. దాంతో కటింగ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఆండ్రూ టై వేసిన బంతికి హార్దిక్ పాండ్య(9) అశ్విన్ చేతిలో క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో మయాంక్ మర్కండే బ్యాటింగ్‌కు వచ్చాడు. 19వ ఓవర్‌కల్లా ముంబయి ఇండియన్స్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన ముంబయి జట్టు ప్రత్యర్థి పంజాబ్ జట్టు ముందు 187 పరుగుల లక్షాన్ని ఉంచింది.

Comments

comments