Search
Thursday 15 November 2018
  • :
  • :

మునగ ఆకుల్లో పోషకాలు పుష్కలం

leafమునగక్కాడలు శరీరానికి ఎంతో మంచివి అని అంటుంటారు. కానీ, మునగ ఆకుల్లో కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో దాగున్నాయి. సన్నగా, గుండ్రంగా ఉండే ఈ ఆకుల నుంచి పోషకాలు, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, క్యాల్షియం ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. మరి మునగ ఆకులో దాగున్న పోషకాలంటో తెలుసుకుందాం. ఎండిన మునగ ఆకుల్లో విటమిన్స్ , ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. క్యారట్ల ద్వారా పొందే విటమిన్ ఏ ని 10రెట్లు ఎక్కువగా పొందవచ్చు. అదేవిధంగా, పాల నుంచి పొందే క్యాల్షియం కంటే 17 రెట్లు ఎక్కువగా మునగ ఆకు నుంచి పొందవచ్చు. ఈ ఆకుల్లో పొటాషియం కూడా బాగానే ఉంటుంది. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని నియంత్రణలో ఉంచుతుంది. మహిళలు రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చని సైంటిస్ట్‌లు సూచిస్తున్నారు. థైరాయిడ్ నివారణకు కూడా ఇది ఉపకరిస్తుంది. క్యాన్సర్ నిరోధించే గుణాలు కూడా ఉన్నాయని తాజా అధ్యయనాలు తేల్చాయి. కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్లన్నీ ఈ ఆకులో లభిస్తాయి. పొట్టలో హానికారక క్రిములను తగ్గిస్తుంది. బాలింతలు తింటే పాలు పడతాయి. నీటిని శుభ్రంచేయటంలో మునగ విత్తనాలు బాగా పనిచేస్తాయి.

Comments

comments