Search
Friday 21 September 2018
  • :
  • :

మంత్రి హామీపై నీలినీడలు

రాజీనామాకు చైర్మన్ నిరాకరణ?
ఎంఐఎం నేతల్లో ఆందోళన
చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు

Minister-Mahender-reddy

మన తెలంగాణ/తాండూరు : తాండూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామాపై నీలినీడలు కమ్ముకున్నాయి.సాక్షత్తు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మీడియా ముందు చైర్మన్ రాజీనామా చేస్తుందని ప్రకటించారు. అయితె రాజీనామాకు ప్రస్తుత చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి నిరాకరించినట్లు సమాచారం. మంత్రి హామి ఇచ్చి మూడు రోజులు గడుస్తున్న ఇంత వరకు చైర్మన్ రాజీనామా చేయలేదు.దీంతో ఎంఐఎం నేతల్లో ఆందోళన పెరుగుతుంది.వైస్ చైర్మన్‌గా ఉన్న ఎంఐఎం కౌన్సిలర్ సయ్యద్ సాజిద్ అలి అనుకున్న సమయానికి రాజీనామా చేశారు,ఈ విషయంలో ఇరు పార్టీల కౌన్సిలర్‌లతో సంప్ర దిం పులు జరిగాక మంత్రి మహేందర్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి రాజీనామా చేస్తుందని ప్రకటించారు.దీంతో ఎంఐఎం కౌన్సిలర్‌లు కొత్త చైర్మన్ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నారు.అయితె మంత్రి హామి ఇచ్చి మూడు రోజులు గడుస్తున్న చైర్మన్ రాజీ నామా చేయకపోవడంపై పలు అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి.గురువారం మంత్రి అనుచరులు వెల్లి రాజీనామా చేయా లని చైర్మన్ కోట్రిక విజయలక్ష్మికి సూచించిన ఆమె అందుకు నిరాకరించనట్లు సమాచారం.

దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.ప్రస్తుత చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి భర్త ఆరోగ్య విషయం వల్ల రాజీనామా ఆలస్యమవుతుందని టిఆర్‌ఎస్ కౌన్సిలర్‌లు పేర్కోంటున్నారు.తాజా పరిణామాలపై ఎంఐఎం నేతలు ఆందోళనలు చెందుతున్నారు. మంత్రి హామి ఇచ్చిన చైర్మన్ రాజీనామా చేయకపోవడంపై ఎంఐఎం కౌన్సిలర్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితె టిఆర్‌ఎస్,ఎంఐఎం పార్టీలలో ఉన్న అసంతృప్తిని తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.కాంగ్రెస్ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన సునితా సంపత్ చైర్మన్ స్థానాన్ని కైవశం చేసుకోవాలని అసంతృప్తి కౌన్సిలర్‌ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.కాంగ్రెస్ పార్టీ మాజి డిసిసిబి అధ్యక్షులు లకా్ష్మరెడ్డి చైర్మన్ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తు న్నారు. అసంతృప్తి కౌన్సిలర్‌ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుత మున్సి పల్‌లో 31 వార్డులకు గాను టిఆర్‌ఎస్‌కు 10,ఎంఐఎంకు 10,కాంగ్రెస్‌కు 8,టిడిపి 2,బీజేపి ఒక్క స్థానంలో గెలుపొందారు ,చైర్మన్ స్థానానికి కావాల్సిన బలం 17 మంది కౌన్సిలర్‌ల మద్దతు అవసరం ఇందుకోసం ఎంఐఎం,టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి కౌన్సిలర్‌లను బుజ్జగిస్తున్నారు. చైర్మన్ రాజీనామాకు నిరాకరిస్తే మంత్రి హామిపై నిలదీయడానికి ఎంఐఎం కౌన్సిలర్‌లు సిద్దమ వుతున్నారు. మరో రెండు రోజులలో చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి చేయని పక్షంలో విష యాన్ని ఎంఐఎం పార్టీ అధిష్టానం దృష్టికి తీసు కువెళ్లేం దుకు పార్టీ నేతలు సిద్దమవుతు న్నారు. చైర్మన్ రాజీనామా విషయంలో ము న్సి పల్ రాజకీయం మరింత వేడెక్కింది. మంత్రి మాటను గౌరవించి ప్రస్తుత చైర్మన్ విజయలక్ష్మి రాజీనామా చేస్తారా లేదా అన్న విషయం మరో రెండు రోజులలో తేలనుంది.

Comments

comments