Home ఆదిలాబాద్ మా రూటు సేప‘రేటు’

మా రూటు సేప‘రేటు’

Municipal Councillors Join Congress

మన తెలంగాణ / ఆదిలాబాద్ బ్యూరో: నిర్మల్, ఆదిలాబాద్‌లకు చెందిన కొంత మంది మున్సి పల్ కౌన్సిలర్లు వ్యవహ రిస్తున్న రాజకీయ తీరుపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. నిన్నటి వరకు అధికార పార్టీలో కొనసాగి అక్కడి మంత్రు లకు సన్నిహితంగా వ్యవహ రించిన ఈ కౌన్సిలర్లు అకస్మాత్తుగా టిఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం ఆసక్తిని రెకిస్తుంది. నిర్మల్‌లో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన 20 మంది కౌన్సిల ర్లు అక్కడి ఛైర్మన్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరిన వ్యవహారం టీఆర్‌ఎస్‌లో దూమరం రెపిన సంగతి తెలిసిందే. నిర్మల్ మున్సిపల్ బాటలోనే ప్రస్తు తం ఆదిలా బాద్ మున్సిపాల్టి సైతం ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నయన్న సంకేతాలు వెలువడుతు న్నాయి. అయితే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య క్షులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ కౌన్సిలర్ల ఫిరా యింపుల పర్వా నికి అజ్యం పోస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్‌ను అక్కడి 20 మంది కౌన్సిలర్లు తమ పార్టీలో చేరే విధంగా చేసిన ప్రయత్నాలు ఫలించడంతో మహేశ్వర్‌రెడ్డి అదే వ్యూహాన్ని ఆదిలాబాద్ మున్సి పాల్టిపై ప్రయోగించేందుకు ప్రయ త్నిస్తు న్నారంటున్నారు.

ఆదిలాబాద్ మున్సి పాల్టిలోని దాదాపు 10 మందికి పైగా కౌన్సిలర్లతో మహేశ్వర్ రెడ్డి టచ్‌లో ఉన్నట్లు తెలు స్తోంది. వీరందరిని కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేక పోలేదంటున్నారు. కాగా మంత్రి జోగు రామన్నతో పలువురు కౌన్సి లర్లకు ఇటీవల ఏర్పడ్డ విభేదాలను మహేశ్వర్ రెడ్డి అను కూలంగా మలుచుకుంటు న్నారంటున్నారు. మంత్రిపై అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లపైనే మహే శ్వర్ రెడ్డి గురి పెడుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్ మనీష కూడా మంత్రిపై కొంత మేరకు అసంతృప్తితో ఉన్నప్పటికి అధిష్టానం ఆదేశాలకు తలోగ్గి ఇప్పటి వరకు ఆమె టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు. కాగా టీఆర్‌ఎస్‌కు చెందిన దాదాపు 8 మంది కౌన్సిలర్లు అసంతృప్తితో కాంగ్రెస్‌లో చేరే విషయాన్ని చైర్‌పర్సన్ బహిరంగంగా సమర్ధించకపో తున్నప్పటికి అంతర్గాతంగా మాత్రం ఆమెకు ఈ సమాచారం తెలిసి ఉండవచ్చంటున్నారు. ఇదిలా ఉండగా దాదాపు 10 మందిపైగా కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి చేరేందుకు రంగం సిద్దమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేతలు పెద్దగా స్పందించకపోతుండడం గమనార్హం.

ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్లు పార్టీని వీడితే కొత్త నాయకత్వం వస్తుందని పార్టీని వీడిన వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదంటూ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ది చైర్మన్, టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జీ లోక భూమారెడ్డి వ్యాఖ్యనించడం ప్రాదాన్యతను సంతరించుకుంటోంది. అంతర్గాతంగా కౌన్సిలర్లను సముదాయించే ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. అయితే పలువురు కౌన్సిలర్లు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కౌన్సిలర్ల డిమాండ్ల మేరకు డబ్బులు ఇవ్వాలేమని టీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్చి చెప్పడంతోనే వారు కాంగ్రెస్ వైపు వేళ్లేందుకు సిద్దమయ్యారని సమాచారం. కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరితే వీరికి పెద్ద మొత్తంలోనే అందజేస్తామని హామీ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మల్‌లో జరిగిన పరిణమాల వెనుక సైతం ఇలాంటి ఆరోపణలే వెలువడుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన 20 మంది కౌన్సిలర్ల నుండి ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు మళ్ళీ టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం ఉపందుకుంది. ఈ కౌన్సిలర్లు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోగా ఒకటి రెండు రోజుల్లో తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు చెబుతున్నారు. నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్ల వ్యవహరం అక్కడి టీఆర్‌ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ల వ్యవహరం ఇక్కడి టీఆర్‌ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు కంట్లో నలుసులాగా మారుతుందంటున్నారు.