Home మెదక్ రూ.25 కోట్ల నిధులతో మున్సిపల్ అభివృద్ధి

రూ.25 కోట్ల నిధులతో మున్సిపల్ అభివృద్ధి

municipal

*స్వచ్ఛ్ సర్వేక్షన్‌లో ప్రతిఒక్కరు భాగస్వామ్యులు
*పట్టణంలో కోతుల బెడద, స్వచ్ఛతకు శాశ్వత పరిష్కారం
*ఇంటింటి వరకు భగీరథ పైపులైన్లను విస్తరింపజేస్తాం
*మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్

మనతెలంగాణ/మెదక్ టౌన్: స్వచ్ఛభారత్‌లో భాగంగా పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో మెదక్ పట్టణాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు అంద రూ భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్‌గౌడ్ అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మున్సిపాలిటీ అభివృ ద్ధి కొరకు రూ.10 కోట్లను కేటాయించడం జరిగిందని, అందుకు తోడు స్థానిక శాసనసభ్యురాలు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ద్వారా మరో రూ.15 కోట్ల నిధులను మంజూరిచేయించుకొని మున్సిపాలిటీ పరిధిలో గల పలు వార్డులలోని సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు, వీధి దీపాలు, మహిళా సంఘాల భవనాలు వంటివి నిర్మింపజేసేందుకు పాలకమండలి పూర్తి స్థాయిలో నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. పట్టణంలో ప్ర ధాన రోడ్డు విస్తరణలో కొన్ని చోట్ల సమానత్వాన్ని పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారని, వర్షాకాలంలో మార్కెట్ నుం డి జెఎన్ రోడ్డు మీదుగా వచ్చే వర్షపు నీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నందునా ముందుగానే నాలాలను ఏ ర్పాటు చేయాలని, పెద్ద బజార్ రోడ్డు విస్తరణలో స్థానికులకు మాస్టర్ ప్లాన్ గురించి వివరించాలని 10వ వార్డు కౌన్సిలర్ మేడి మధుసూదన్‌రావు తెలుపగా.. అందుకు చైర్మన్ బదులిస్తూ.. ప్రధాన రహదారి విషయంలో కేవలం మున్సిపల్ కాంప్లెక్స్ ఎదు ట మాత్రమే చిన్న సమస్య ఉందని, అంతే కాకుండా రోడ్డు మధ్య భాగంలో కొన్ని దర్గాలు, గుడులు వస్తున్నాయని వాటి పరిష్కారం కోరకు పీస్ కమిటీ ఏర్పాటు చేసి మతపెద్దలతో సామరస్యంగా చర్చించి పరిష్కరించే విధంగా కృషి చేస్తాన్నారు. పెద్ద బజార్ రోడ్డు విషయంలో కూడా స్థానికులకు భరోసా కల్పించే విధంగా పాలకమండలి ఉంటుందని, తదుపరి వారికి చట్టపరమైన ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీ సుకుంటామన్నారు. జెఎన్ రోడ్డులో నిలిచే వర్షపు నీటికి నాలాలను కూడా నిర్మింపజేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచుతామన్నారు. అంతేకాకుండా పట్టణంలో విస్తరిస్తున్న మిషన్‌భగీరథ  పైపులైన్లు ప్రతి ఇంటింటి వరకు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లుఎస్ ఎఇకి మున్సిపల్ శాఖా వారు పూర్తి సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఈ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సిబ్బందికి చైర్మన్ ఆదేశించారు. కొందురు కౌన్సిల్ సభ్యులు పట్టణంలో కోతుల బెడద గురించి ప్రస్తావించగా… కోతులను పట్టి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి అడవుల్లో వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు, అందుకొరకు కోతులను అక్కడికి తీసుకువెళ్ళేందుకు వాహనాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు రూ. 15 లక్షలను ఖర్చు చేస్తున్న ట్లు చైర్మన్ తెలిపారు. కౌన్సిలర్లు అంకం చంద్రకళ, బట్టి సులోచనలు తెల్లవారిపోయినప్పటికీ కూడా వీధిదీపా లు వెలుగుతూనే ఉన్నాయని, సిబ్బంది నిర్లక్షం వలన విద్యుత్ నిర్వినియోగమవుతుందని అందుకు చర్యలు తీసుకోవాలని కోరగా చైర్మన్ స్పందిస్తూ వీధిదీపాల విషయంలో ఇక ముందు ఇలాగే కొనసాగితే నిర్లక్షం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక రాందాస్‌చౌరస్తాలో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ కొరకు డిసెంబర్ 15 వరకు పక్కా ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛ్ సర్వేక్షన్‌పై అవగాహన కల్పించండి – చైర్మన్
పట్టణంలోని ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కలిగించేందుకు స్వచ్ఛసర్వేక్షన్ యాప్‌లను స్మార్ట్ ఫోన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి అవగాహన పొందాలన్నారు. రాష్ట్రంలో స్వఛ్ఛ్‌సర్వేక్షన్‌లో మెదక్ మున్సిపాలిటి 6వ స్థానంలో ఉందని, ప్రజలందరి సహకారంతో, అధికారుల సమన్వయంతో, మహిళా సంఘాల సాధికారతతో మొదటి స్థానంలోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు మేడి మధుసూదన్‌రావు, అనీల్‌కుమార్, ఆర్కే శ్రీనివాస్, సలాం, అంకం చంద్రకళ, బట్టి సులోచన, దోంతి లక్ష్మి, ఆరెళ్ల గాయత్రి, విజయలక్ష్మి, కోఆప్షన్ మెంబర్ సాదిక్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రావు, ఎఇ సంజీవులు, సిబ్బంది బట్టి రమేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.