Home వికారాబాద్ జీషాన్ హోటల్‌పై మున్సిపల్ అధికారుల దాడులు

జీషాన్ హోటల్‌పై మున్సిపల్ అధికారుల దాడులు

chicken

కుళ్ళిన మాసం ముక్కలు స్వాధీనం
యజమానిపై కేసు నమోదు
శానిటరీ ఇన్స్‌పెక్టర్‌పై మండిపడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసిఫ్

మనతెలంగాణ/తాండూరు టౌన్ : తాండూరు పట్టణంలోని పలు హోటళ్ళు,కిరాణం కోట్టులపై మున్సిపల్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని హోటళ్ళు, కిరాణ షాపులతో పాటు, స్వీట్ హౌజ్‌ల్లో కుళ్ళిన వస్తువులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని గమనించిన మున్సిపల్ అధికారులు తాండూరు పట్టణంలోని హోటళ్లు తనిఖీ చేపట్టారు.అంబేద్కర్ చౌక్ సమీపంలోని జీషాన్ హోటల్‌ను తనిఖీ చేయగా కుళ్ళిన మాసం ముక్కలు లభించాయి. కుళ్ళిన మాసం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కుళ్ళిన మాసం ముక్కలను వడ్డిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న జీషాన్ హోటల్ యాజమానిపై కేసునమోదు చేసినట్లు తెలిపారు.అంతే కాక తాండూరు పట్టణంలోని వెంకటేశ్వర కిరాణ మర్చంట్, స్వీట్ హౌజ్‌లోలను తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులకు గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నట్లు గమనించిన వాటల్ బాటిళ్లతో పాటు కూల్ డ్రింక్స్ బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

శానిటరీ ఇన్స్‌పెక్టర్‌పై మండిపడ్డ
మున్సిపల్ వైస్ చైర్మన్
హోటళ్ళపై తనిఖీ చేసే అధికారం నీకెక్కడదని, నీ పని నువ్వు చూసుకోవాలని తాండూరు షానీటరి ఇన్స్‌పెక్టర్ విక్రంమసింహారెడ్డిపై తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసిఫ్ మండిపడ్డారు.ఇందుకు శానిటరీ ఇన్స్‌పెక్టర్ సమాధానం చెప్పె ప్రయాత్నం చేసిన వినిపించుకోని వైస్ చైర్మన్ ఆయనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.నువ్వేమైనా ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌వా తనిఖీ చేయడానికి అని ప్రశ్నించారు.పుడ్ ఇన్స్‌పెక్టర్ లేకుండా మీరు ఎలా తనిఖీలు చేశారని అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా తాను హోటళ్ళు, తినుబండారాల బండ్ల,కిరాణం షాపులతో తనిఖీ చేశారని శానిటరీ ఇన్స్ పెక్టర్ సమాధానం చెప్పుకొచ్చారు.