Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మేడే రోజే.. కార్మికులకు కష్టాలు..

municipal workers working in mayday
పీడిత జాతులకు .. రాని స్వాతంత్య్రం..
మురుగు కాల్వల్లోనే ..పారిశుధ్యకార్మికుల జీవితం వ్యర్థం..

వనపర్తి : ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కార్మికులకు విముక్తి జరిగే రోజు కష్టాలపాలయ్యారు. మేడే దోపిడి దురాగతాలకు వ్యతిరేకంగాశ్రామికులు పిడికిలి ఎత్తిన రోజు మేడే అని హక్కుల కోసం పోరాడి శక్తి వంతం చేసేందుకు కార్మిక వర్గం నిరూపించినరోజు మేడే అని . కార్మిక వర్గం నినదించిన మేడే . పోరాటాల్లో అసువులు బారిన అమరవీరుల వసంతం నివాళులర్పించిన రోజు మేడేఅని పలువురు వక్తలు పేర్కొన్నారు. నేటి సమాజంలో శతాబ్దాల కాలంగా మేడే దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పండగలా జరుపుతుంటే పురపాలక కార్మికులు మాత్రం మురుగు కాల్వల్లో కార్మికులు పని చేస్తున్నారు. కష్టజీవుల శ్రమ పాలక వర్గాల కబంధహస్తాలల్లో నలిగి పోతు న్నాయి. శ్రమ చేసే వారికి హక్కులను కల్పించే పాలకులు లేరు. వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం కూడా కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు శ్రమ దోపిడికి గురౌతున్నారు. రాజ్యాంగంలో కార్మికులకు ఎన్నో చట్టాలు కల్పించిన కూడా అమల్లో పాలకులు జాప్యం చేస్తున్నారు. కార్మికులు హక్కుల కోసం పోరాడితే నిర్బందం చేస్తున్నారని , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు పెంచాలని, ఉద్యోగ భద్రతకల్పించాలని డిమాండ్ చేసినప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Comments

comments