Search
Wednesday 26 September 2018
  • :
  • :

పరకాల మున్సిపాలిటీలో వేడెక్కుతున్న రాజకీయాలు

Municipality War In Parakala Town

మన తెలంగాణ/ పరకాల టౌన్ : పరకాల మున్సిపాలిటీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన మార్త రాజభద్రయ్య చైర్మన్‌గా నాలుగేండ్లు కొనసాగారు. టిఆర్‌ఎస్‌లో విభేధాల మూలంగా ఇటీవల రాజీనామచేసి ఈ నెల 4న కాంగ్రెస్‌పార్టీ పరకాల నియోజకవర్గ ఇంచార్జీ ఇనుగాల వెంకంట్రామిరెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. దీం తో పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు రాజకీయ పరిణామాలు ఒక్కసారి వేడెక్కాయి. ఈ నేపధ్యంలో పరకాల మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దగ్గించుకునేందుకు టీఆర్‌ఎస్‌పార్టీ కౌన్సిలర్లు ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి పావులు కదిపారు. ఈ నేపధ్యంలో 15 మందితో కూడిన కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి వరంగల్ రూరల్‌జిల్లా కలెక్టర్ హరితకు నోటీసు అందజేశారు. దాంతో పరకాల్లో రాజకీయ సమీకరణాలు మూడు పువ్వులు, ఆరుకాయల్లాగ మారింది. చైర్మన్ పై అవిశ్వాస తీర్మాణానికి రంగం సిద్ధం చేసుకోవడంతో చైర్మన్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. దాంతో చైర్మన్ పదవిని ఎలాగైన అవిశ్వాసం ఆమోదించుకొని టీఆర్‌ఎస్ కౌన్సిలర్‌కు చైర్మన్ పదవిని దక్కించుకోవాలని గట్టిపట్టుదలతో టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. ప్రభుత్వ నిభంధనల ప్రకారం మున్సిపాలిటీ చైర్మన్ అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి హాజరైన సభ్యులతో 2/3వ వంతు కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గుతుందని సమాచారం. దాంతో చైర్మన్ పదవిని ఎలాగైన ఆమోదించుకొని టీఆర్‌ఎస్ అభ్యరితని గెలిపించుకోవాలని పట్టుదలతో ఉండగా అందుకు పోటీగా కాంగ్రెస్ పార్టీకూడా పెద్దమొత్తంలో కసరత్తు ముమ్మరంచేసి చైర్మన్ పదవిని దక్కించుకోవాలన పట్టుదలతో ఉంది ఈ నేపధ్యంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు కౌన్సిలర్లను మచ్చిక చేసుకొవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. పరకాల మున్సిపాలిటీ 20 మంది కౌన్సిలర్లు ఉండగా టీఆర్‌ఎస్ పార్టీకి 12 మంది కాంగ్రెస్‌పార్టీకి 6గురు, బీజేపి ఇద్దరు ఉన్నారు. ఈ నేపధ్యంలో నేడు 17వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు కౌన్సిలర్లతో భేరసారాలు, సంప్రదింపులు మొదలైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఎలాగైన చైర్మన్ పదవిని దక్కించుకోవాలని కసరత్తు ప్రారంభించింది.

Comments

comments