Search
Monday 24 September 2018
  • :
  • :

విజ‌య్‌తో అభిమానులు చెడుగుడు..!

Murali Vijay Trolled On Twitter By Fans
లార్డ్స్: ఇంగ్లండ్ పర్యటనను విజయాలతో ప్రారంభించిన టీమిండియా టెస్టులకు వచ్చేసరికి పాత రికార్డులను గుర్తుకు తెస్తోంది. ఎన్నో అంచనాలతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఇలా డీలాపడడం ఎవరూ ఊహించనిది. అందులోనూ టెస్టుల్లో ప్రపంచ నెం.01 జట్టు కావడం గమనార్హం. ఐదు మ్యాచ్ ల టెస్టు సీరిస్ లో ఇప్పటికే మొదటి రెండు టెస్టుల్లో ఓటమితో చతికిలపడింది. బ్యాట్స్ మెన్ల వైఫల్యానికి తోడుగా బౌలర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో కోహ్లీసేనకు పరాజయాలు తప్పడం లేదు. ప్ర‌స్తుత ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఘోరంగా విఫలమైన భార‌త జ‌ట్టుపై సోష‌ల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. లార్డ్స్‌ టెస్టులో క‌నీస పోరాటం కూడా చూపకుండా చేతులెత్తేయడం భారత అభిమానులకు మింగుడుపడడం లేదు. అది కూడా ఏకంగా ఇన్సింగ్స్ ఓట‌మి ఫ్యాన్స్ ను తీవ్రంగా కలిచివేసింది.
దీంతో క్రికెట్ అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా కోహ్లీసేనపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా  లార్డ్స్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డ‌కౌట్ గా పెవిలియన్ చేరిన ఓపెనర్ ముర‌ళీ విజ‌య్‌పై ట్రోలింగ్ తో తాటతీస్తున్నారు. వెంట‌నే అతడిని జట్టు నుంచి ఉద్వాసన పలకాలని డిమాండ్ చేస్తున్నారు. విజ‌య్‌పై కొందరు అభిమానులు చేసిన ట్రోలింగ్స్ ఇలా ఉన్నాయి. `ముర‌ళీ విజ‌య్ టైమ్ అయిపోయింది.. అతడిని జ‌ట్టులో నుంచి త‌ప్పించండి` `ముర‌ళీ విజ‌య్.. ఎప్పుడు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్నావు, మ‌నీశ్ పాండే, కేదార్ జాద‌వ్‌, శ్రేయాస్ అయ్య‌ర్ టెస్టుల కోసం సిద్ధంగా ఉన్నారు`, `కేఎల్ రాహుల్‌ ముర‌ళీ విజ‌య్‌ల‌ను త‌ప్పించి.. కియా లీగ్‌లో అద్భుతంగా ఆడుతున్న మ‌హిళా క్రికెట‌ర్లు స్మృతి మందానా, హార్మ‌న్ ప్రీత్‌ల‌కు అవ‌కాశం కల్పించడం మంచిది`, అంటూ నెటిజ‌న్లు విజ‌య్‌తో చెడుగుడు ఆడుతున్నారు. అభిమానుల ఆగ్రహా జ్వాలలు చల్లబడాలంటే కోహ్లీసేన మిగిలిన టెస్టుల్లో విజయం సాధించాలి.

Comments

comments