Home అంతర్జాతీయ వార్తలు వెనెజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం

వెనెజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం

Venezuela : Murder Attempt on Presidentకారకాస్ : వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోపై హత్యాయత్నం జరిగింది. శనివారం ఆయన సైనిక కవాతులో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయనపై డ్రోన్ల ద్వారా దాడి జరిగింది. ఆయనకు సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న డ్రోన్లు పడ్డాయి. ఈ దాడి నుంచి నికోలస్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే లెఫ్ట్ పార్టీలే ఈ దాడికి పాల్పడినట్టు ఆ దేశ మంత్రి జార్జ్ రోడ్రిగోజ్ ఆరోపించారు. ఇది పొరుగు దేశమైన కొలంబియా పనేనంటూ అధ్యక్షుడు నికోలస్ ఆరోపించారు. ఈ దాడికి సంబంధించి అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో రికార్డు అయింది. ఈ దాడిలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. మరికొందరిని సిసి కెమెరాల ద్వారా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అధ్యక్షుడు సురక్షితంగా బయటపడినప్పటికీ, 9మంది గాయపడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడి చేసింది కొలబియా, అమెరికాలోని కొందరు ఆర్థిక వేత్తలేనని మాదురో ఆరోపిస్తుండగా, ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని కొలంబియా స్పష్టం చేసింది. తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కొలంబియా అధికారులు తేల్చి చెప్పారు. ఈ ఘటనపై వెనెజులా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Murder Attempt on Venezuela President