Search
Saturday 21 July 2018
  • :
  • :

భూతగాదాల్లో ఇద్దరి దారుణ హత్య

murder For land disputesసంఘటనా స్థలాన్ని పరిశీలించిన కుమ్రం భీం జిల్లా ఎస్‌పి కల్మేశ్వర్ సింగెనవార్ 

భూ తగాదాల కోసమే హత్య

మన తెలంగాణ/కౌటాల : భూతగాదాల కోసమే వరుసకు పెద్దమ్మ, చిన్నమ్మలైన వారిని బావ కొడుకు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్ అన్నారు. కౌటాల మండలంలోని మొగడ్‌దగడ్ గ్రామంలో భూ తగాదాలతో గురువారం సాయంత్రం  ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురైన సంఘటన స్థలంలో మహిళలను మృతదేహాలను శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం మహిళల మృత దేహాలకు పోస్టుమార్టం కోసం సిర్పూర్(టి) ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు.  హత్యకు గురైన కుటింబీకుల హత్యకు గురైన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కౌటాల మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి మెస్రం వచ్చలాబాయి, మెస్రం కమలాబాయి, మెస్రం నానాజీలకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి పంచుకునే విషయంలో తగాదా ఉందని తెలిపారు. గురువారం సాయంత్రం వివాదంలో ఉన్న వ్యవసాయ చేనులో నానాజి ట్రాక్టర్‌తో దున్నిస్తున్న సమయంలో వచ్చలాబాయి, కమలాబాయి చేనుకు వెళ్లి భూమి సమస్య పరిష్కారం కాలేదని , భూమిని దున్నవద్దని నానాజితో వాధించారు. దీంతో పెద్దమ్మ వచ్చలాబాయి, చిన్నమ్మ కమలాబాయిల తల , మెడపై వరసకు బావ హన్మంతు కొడుకు నానాజి దారుణంగా గొడ్డలితో నరికారు. తీవ్ర రక్తస్రావం అయి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. ఇద్దరు మహిళలను హత్య చేయడానికి ఎవరైనా సహకరించారని, హత్యకు దారి తీయడానికి గల కారణాలు ఏంటని పోలీసుల విచారణ. ఆయన వెంట కాగజ్‌నగర్ డీఎస్పి సాంబయ్య, కౌటాల సీఐ మోహన్, ఎస్సైలు రామారావు, అశోక్‌లు ఉన్నారు.

Comments

comments