Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

బోరవెల్లిలో వ్యక్తి హత్య

Assailants Murdered a Child in Uppal

జోగులాంబ గద్వాల : మానవపాడు మండలం బోరవెల్లిలో మంగళవారం ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. పాత వివాదాల కారణంగా నలుగురు వ్యక్తులపై తండ్రీకొడుకులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఘటనాస్థలిలోనే ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ గొడవ కారణంగా గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Murder in Boravelli

Comments

comments