Search
Wednesday 21 November 2018
  • :
  • :

నటుడు ప్రకాష్ రాజ్ హత్యకు కుట్ర…?

prakash-rai

బెంగళూరు: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను హత్యచేయడానికి కుట్ర జరిగినట్టు కర్నాటక సిట్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు కేసులో కొందరు రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆయన గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఆమె హత్య కేసులో ప్రకాష్ రాజ్ పలు విమర్శల  సైతం ఏదుర్కున్నారు. గౌరీ లంకేష్ తనకు మంచి స్నేహితురాలని ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రధాని మోడీని ప్రజా వేదికలపై ప్రకాష్ రాజ్ విమర్శిస్తున్నక్రమంలో ఆయనను చంపడానికి గౌరీలంకేష్ హత్య నిందితులు పథకం వేసినట్టు పోలీస్ దర్యాప్తులో తెలింది. అంతే కాకుండా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ను కూడా అంతం చేయడానికి కుట్ర పన్నినట్టు బయట పడింది. పోలీస్ విచారణలో భాగంగా ప్రకాష్ రాజ్ ను హత్య చేయాలన్న పథకం రచించినట్టు గౌరీ లంకేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన పరశురామ్ వాఘ్మోర్ చెప్పాడు.

గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక ప్రకటనలు చేయడమే ముఖ్య కారణమని వాఘ్మోర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించాడు. భిన్నమైన అభిప్రాయం కలిగిన వారిని చంపడం పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన ఆలోచనలు విషపూరితమైనవని తెలిపారు. తాను మతాలను ఉద్దేశించి ఏ వ్యతిరేకమైన ప్రకటనలు చేయలేదని సూచించారు. కాకపోతే మత రాజకీయాలు చేయడాన్ని వ్యతిరేకించానని చెప్పారు. తన గొంతుకను మూగబోయేలా చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ ఇక మీదట అది మరింత బలంగా మారుతుందంటూ ట్వీట్టర్ వేదికగా తెలియజేశారు.

Comments

comments