Search
Sunday 18 November 2018
  • :
  • :

మర్పల్లిలో వ్యక్తి దారుణహత్య…

Murder of man in murpalli
వికారాబాద్: మండలకేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మర్పల్లి మండలకేంద్రానికి చెందిన బేగారి తుల్జయ్య (65) వ్యవసాయదారుడు. గురువారం ఆయన ఇంటికి బందువులు రావడంతో కల్లుతేవడానికి ఇంటికి కొద్దిదూరంలో ఉన్న కల్లు దుకాణానికి వెల్లాడు. అక్కడ కల్లును తీసుకోని తలరుమాలులో కట్టుకోని బయటకు వస్తుండగానే అక్కడే దారికాచిన ఓవ్యక్తి వేట కోడవలితో తుల్జయ్య కడుపు, గొంతుపై బలంగా దాడి చేయ్యడంతో తుల్జయ్య అక్కడికక్కడనే కుప్పకూలి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తానే తుల్జయ్యను హత్య చేసినట్టు వేటకోడవలితో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న మర్పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. ముందు జాగ్రత చర్యగా మోమిన్‌పేట్, కొట్‌పల్లి బంట్వారం మండలాలనుండి అరుణ్‌కుమార్, ఏడుకొండలు, శేఖర్‌గౌడ్ పోలీసులు బందోబస్తును నిర్వహించారు.
పోటోరైటఫ్‌ః16.ఎంఅర్‌పిః01.హత్యకు గురైన తుల్జయ్య..02.చూసేందుకు వచ్చిన గ్రామస్థులు..

Comments

comments