Home రాష్ట్ర వార్తలు నల్లగొండలో దారుణ హత్య

నల్లగొండలో దారుణ హత్య

14

మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త శ్రీనివాస్‌ను పథకం ప్రకారం అర్ధరాత్రి బండరాయితో మోది చంపిన దుండగులు 

నల్లగొండ ప్రతినిధి: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది.నల్లగొండ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ (42)ను ప్రత్యర్థులు బుధవారం అర్థరాత్రి రాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ హత్యాసంఘటన జిల్లాను కుదిపివేసింది. రాత్రి 12 గంటల సమయంలో గాంధీనగర్‌లో గొడవ జరుగుతుందని ఫోన్ కాల్ రావడంతో తన సహచరుతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లారు. ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు గాంధీనగర్ పరిసరాల్లో వెతకగా మురుగు కాల్వ లో శవమై కన్పించినట్లు శ్రీనివాస్ కుటుంభ సభ్యులు బోరున విలపిస్తూ చెప్పారు. శవాన్ని గుర్తుపట్టలేని విధం గా హంతకులు శ్రీనివాస్ తలను రాళ్ళ తో చిధ్రం చేశారు. నల్లగొండ ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ సుధాకర్ లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీంను, డాగ్ స్వాడ్ ను రప్పించి విచారణ చేపట్టా రు. పోస్టుమార్టం కొరకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి త రలించారు. పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమా నులు బారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకొన్నారు. శ్రీని వాస్ హత్య సమాచారంతో నల్లగొండ ఎంఎల్‌ఎ వెంకట్ రెడ్డి హైద్రాబాద్ నుంచి బయల్దేరి గురువారం తెల్లవారు జామున నల్లగొండ చేరుకొని శ్రీనివాస్ మృతదేహం వద్ద బోరున విలపించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. కా గా శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు నలుగురు నిందితు లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో రౌడీల రాజ్యం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రౌడీల రాజ్యం నడుస్తోందని సిఎల్‌పి ఉపనేత, నల్లగొండ ఎంఎల్‌ఎ వెంకట్‌రెడ్డి, ఎంఎల్ సి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. శ్రీనివాస్ హత్యకు నిరస నగా గురువారం నల్లగొండలో బంద్ నిర్వహించారు. నిం దితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గడియారం సెంటర్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ధర్నా చేశారు. మాజీ నక్సలై ట్లను, గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో అంటకాగిన వారితో అరా చాకాలు చేయిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీలో చేరకపోతే చంపుతామని పలుమార్లు శ్రీనివాస్‌ను బెదిరిం చారని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. గన్‌మెన్లను ఇ వ్వమని మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులు అర్ధించినప్పటికీ వారికి కావాలనే ప్రభుత్వం రక్షణ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఏమీ చేయలేకనే పథ కం ప్రకారం తన అనుచరుడిని హత్య చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హ త్యేనని ఆరోపించారు. శ్రీనివాస్ హత్యపై సిబిసిఐడి చేత వి చారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితుల ఆరు నెలల ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తే శ్రీనివాస్ హత్యకు పథ కం, పన్నిన అసలు నేరస్థులు వెలుగులోకి వస్తారని పేర్కొ న్నారు. ప్రస్తుత డిఎస్‌పి హయంలో కాంగ్రెస్ కార్యక ర్తలపై దాడులు పెరిగాయన్నారు. రౌడీ రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.