Search
Wednesday 21 November 2018
  • :
  • :

వ్యక్తి దారుణ హత్య

Murder of Person terrible in kalwakurthy

కల్వకుర్తి: మండల పరిధిలోని సుద్దకల్ దుందుబి వాగు బ్రిడ్జి కింద వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. డిఎస్ పి తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు కత్తి రామదాసు హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన వాడని అతని ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. దుందుబి వాగు బ్రిడ్జి కింది రామదాసు హత్యకు గురై ఉండడాని గమనించిన గ్రామస్తులు వేంటనే పోలీసులకు సమాచారం అందించారు.  కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు కల్వకుర్తి డిఎస్పి పుష్పారెడ్డి, సిఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ నర్సింహ్ములు తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల వివరాలు తెలుసుకున్నారు. ఆదారు కార్డు వివరాల ప్రకారం కుటుంబ సభ్యులకు సమచారం అందించారు. మృతదేహాని  పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Murder of Person terrible in kalwakurthy

Telangana Latest News

Comments

comments