Home అంతర్జాతీయ వార్తలు కుటుంబాన్ని హత్యచేసి… తాను తుపాకీతో..

కుటుంబాన్ని హత్యచేసి… తాను తుపాకీతో..

Suicide-Gun

రోమ్: ఇటలీలోని జెనోవా నగరంలో దారుణం జరిగింది. ఓ పోలీసు అధికారి తన భార్య, ఇద్దరు కూతళ్లను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వీటి నుంచి బయటపడే మార్గంలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. మౌరో అగ్రోసి (50) అనే పోలీస్ అధికారి తన కుటుంబాన్ని హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులకు పోన్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి అగ్రోసీ, ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు శవాలుగా కనిపించారు.