Home తాజా వార్తలు దురాజ్‌పల్లి జాతరకు మూసీ నీరు విడుదల

దురాజ్‌పల్లి జాతరకు మూసీ నీరు విడుదల

Musi project water

 

నీటి పారుదల శాఖ అధికారులకు మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు
సమీప గ్రామాల్లో చెర్వులు నింపుకునే అవకాశం
ఎడమ కాల్వతో పాటు కుడి కాల్వకు 25 వరకు నీరు విడుదల
హర్షం వ్యక్తంచేస్తున్న ప్రజలు

మన తెలంగాణ/సూర్యాపేట: పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తులకు నీటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను మూసీ నీటిని విడుదల చేయాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను బుధవారం ఆదేశించారు తెలంగాణలో ప్రసిద్ది చెందిన పెద్దగట్టు జాతర ఈనెల 24నుండి 28వరకు జరగనుంది. పెద్దగట్టు జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తులతో పాటు పోరు రాష్ట్రాలైన ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుండి భక్తులు అధికసంఖ్యలో రానున్నారు. దీనికి తోడు రెండవసారి మంత్రి పదవి చేపట్టిన అనంతరం మొదటి సారి సూర్యాపేటకు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అభినందించేందుకు వివిధ గ్రామాల నుండి రైతాంగం తమ గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మెరపెట్టుకున్నారు. దీనికి స్పందించిన మంత్రి అప్పటికప్పుడే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి గురువారం ఉదయం నుండే మూసీ ఎడవ, కుడి కాల్వలకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు.

ఈనెల 25వరకు నీటిని కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. దురాజ్‌పల్లి జాతరకు వచ్చే భక్తులతో పాటు మూసీ నుండి సూర్యాపేట వరకు మార్గమద్యలో ఉన్న యండ్లపల్లి, పిల్లలమర్రి, పిన్నాయిపాలెం రామచంద్రాపురం, మచం ద్రాపురం తదితర గ్రామాల్లో చెర్వులు నింపుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూసీ కుడికాల్వ విడుదల చేయడం ద్వారా అటు ఎడమ, ఇటు కుడికాల్వల కింద ఉన్న చెర్వులు నిపుకున్నట్లు అయితే వ్యవసాయ భూములకు కూడా ప్రయోజకరంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదీ ఇలా ఉండగా తమ విజ్ఞప్తిని మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించడంతో రైతుల్లో హర్షతిరేఖలు వ్యక్తమయ్యాయి.

Musi project water released to Duraz Palli Fair in Suryapet