Home జాతీయ వార్తలు ముస్లింల పెళ్లిపత్రికలో సీతారాముల ఫొటో

ముస్లింల పెళ్లిపత్రికలో సీతారాముల ఫొటో

Wedding-Card

ఉత్తరప్రదేశ్: పెళ్లి పత్రికలో సీతారాముల ఫొటోను ముద్రించి అందరూ సమానమేనని చాటిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని చిలావా గ్రామంలో  చోటు చేసుకుంది. ఒక ముస్లిం కుటుంబం పరమత సహనాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. కుటుంబ సభ్యులు కూతురు వివాహం సందర్భంగా పెళ్లి పత్రికలో సీతారాముల ఫొటోను ముద్రించి పత్రికను తయారు చేయించారు. ఈ సందర్భంగా వధువు తల్లి మాట్లాడారు. తమ గ్రామంలో హిందూ, ముస్లింలు సోదరభావంతో మెలుగుతుంటారని, పరమత సహనాన్ని తాము ప్రచారం చేయాలనుకున్నామని ఆమె పేర్కొన్నారు.

Muslim family puts Seetha Rama photo on wedding card