Home తాజా వార్తలు మోడీ, యోగి బొమ్మలు గీసిందని…

మోడీ, యోగి బొమ్మలు గీసిందని…

Modi-and-Yogi

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బొమ్మలు గీసిందని ఓ ముస్లిం మహిళను అత్తింటివారు ఇంట్లోంచి గెంటివేసిన దారుణ ఘటన యుపిలోని బల్లియా ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే నగ్మా పర్వీన్‌కి పెయింటింగ్‌ అంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలో సరదాగా ప్రధాని మోడీ, యోగి చిత్రాలు గీసింది. అంతే.. అది చూసిన అత్తింటివారు ఆమెను చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి గెంటేశారు. దీంతో పుట్టింకి చేరుకున్న పర్వీన్‌ జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మతిస్థిమితం లేకపోవడంతోనే ఇలాంటి చిత్రాలు గీస్తుందని ఆరోపిస్తూ తన కుమార్తెను చిత్రహింసలకు గురిచేయడంతో పాటు ఇంట్లోంచి గెంటివేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Muslim woman thrown out of matrimonial house for painting of PM Modi, CM Yogi Adityanath.