Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నాకు లభించిన గొప్ప బహుమతి నా కూతురు : మహేష్‌బాబు

Mahesh-Babu-And-Sitaraటాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉంటారో.. కుటుంబ సభ్యలకూ అంతే సమయం కేటాయించి వారితో ఎంజాయ్ చేస్తుంటారు. మొన్న ఆయన సతీమణి నమ్రత పుట్టినరోజు వేడుకను కూడా మహేష్ ఎంతో ఘనంగా సెలబ్రెట్ చేసిన విషయం తెలిసిందే. కాగా మహేష్ తన కూతురంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి తెలియజేశారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆయన తన కూతురి గురించి ట్వీట్ చేశారు. ఆయన కూతురు సితారా ఫోటోను ట్వీట్ చేసిన మహేష్ ‘నాకు నా జీవితంలో ఇప్పటి వరకు లభించిన గొప్ప బహుమతి నా కుతురు. నా సంతోషం, గర్వం.. అన్నీ నా కూతురే. మనం మన బిడ్డల పట్ల గొప్ప తల్లిదండ్రులుగా ఉందాం’ అంటూ పేర్కొన్నారు. మహేష్ చేసిన ఈ ట్వీట్‌కు పెద్ద ఎత్తున రీట్వీట్లు, కామెంట్లు వస్తున్నాయి.

Comments

comments